Death : చనిపోయాక కాలిబొటన వేళ్లకు ఎందుకు కడుతారో తెలుసా?

Death : మన దేశంలో ఎన్నో ఆచారాలు, సంస్కృతులు ఉన్నాయి. ప్రతి దానికి ఓ ఆచారం ఉంది. పెళ్లి నుంచి చనిపోవడం వరకు ప్రతి పనిలో మనకు ఓ కొత్త రకమైన ఆచారాలు కనిపిస్తూనే ఉంటాయి. మన పూర్వీకుల నుంచి వచ్చినవే కావడంతో మనం ఇప్పటికి కూడా పాటిస్తున్నాం. మనం ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు హాజరైతే అక్కడే స్నానం చేసి వస్తాం. ఇలా ఒక్కో కార్యానికి ఒక్కో తీరైన పద్ధతి ఉంటుంది. ఇలా మన సంప్రదాయాల్లో ఎన్నో […]

Written By: Srinivas, Updated On : April 8, 2023 1:17 pm
Follow us on


Death :
మన దేశంలో ఎన్నో ఆచారాలు, సంస్కృతులు ఉన్నాయి. ప్రతి దానికి ఓ ఆచారం ఉంది. పెళ్లి నుంచి చనిపోవడం వరకు ప్రతి పనిలో మనకు ఓ కొత్త రకమైన ఆచారాలు కనిపిస్తూనే ఉంటాయి. మన పూర్వీకుల నుంచి వచ్చినవే కావడంతో మనం ఇప్పటికి కూడా పాటిస్తున్నాం. మనం ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు హాజరైతే అక్కడే స్నానం చేసి వస్తాం. ఇలా ఒక్కో కార్యానికి ఒక్కో తీరైన పద్ధతి ఉంటుంది. ఇలా మన సంప్రదాయాల్లో ఎన్నో విశేషమైన పద్ధతులుకనిపిస్తాయి. ఇలా మన జీవితంలో ఆచార వ్యవహారాల మనుగడ వైవిధ్యంగా ఉండటం చూస్తుంటాం.

సనాతన సంప్రదాయాల్లో..

మనం పెళ్లికి చావుకు ఇతర శుభకార్యాలకు ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తుంటాం. మనిషి బతికున్నప్పుడు శివం చనిపోయాక శవం. అన్ని మతాల్లో శవాన్ని శుభసూచకంగానే చూస్తారు. కానీ హిందూ మతంలో మాత్రం శవాన్ని అశుభంగా చూస్తారు. ఇక్కడో విచిత్రమైన ఆచారం ఉంటుంది. చనిపోయిన వ్యక్తి కాళ్లు బొటన వేళ్లు కడుతుంటారు. ఓ తాడు కానీ దారంతో కాని రెండు బొటన వేళ్లు కట్టి వేస్తుంటారు. దీంతో మన మతంలోని ఆచారాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

ఎందుకు కడతారు?

మనిసి చనిపోయాక కాలి బొటన వేళ్లు ఎందుకు దారంతో కడతారు. మనిషి ప్రాణం పోయాక అతడి ఆత్మ ఇక్కడే తిరుగుతుందట. అది పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఇంట్లోకి కూడా వెళ్తుందట. ఆత్మ బయటకు వెళ్లకుండా ఇంట్లోకి వెళ్లేలా చేయడానికే బొటన వేళ్లు కడతారని పూర్వీకులు చెబుతుంటారు. ఇందులో మరో రహస్యం కూడా దాగి ఉందట. చనిపోయిన వ్యక్తి కాళ్లు ప్రాణం లేకుండా పోవడంతో కిందికి పడిపోకుండా ఉండటానికే దారంతో కడతారనేది మరో వాదన. మొత్తానికి మన మతంలో ఉన్న సంప్రదాయాల్లో దీని గురించి చాలా మందికి తెలియదు.

ఆత్మ ఎందుకు దోబూచులాడుతుంది?

మనిషి చనిపోయాక ఆత్మ ఇక్కడే దోబూచులాడుతుందట. చనిపోయిన మనిషి నుంచి ఆత్మ వేరేగా వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఆత్మ అంతర్మథనంలో పడిపోతుందట. ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతుంది. దీంతో ఆత్మ ఎక్కడో తిరగకుండా కాళ్ల నుంచి నేరుగా ఇంట్లోకి వెళ్తుంది. చనిపోయాక ఆత్మ ప్రబోధం ప్రకారమే కాళ్లు కట్టువేయడంతో ఎటువెళ్లదనే నమ్మకం కూడా ఉంటుందట.

Tags