Food : మతిమరుపును దూరం చేసే ఆహారాలేంటో తెలుసా?

Food : ప్రస్తుత కాలంలో మతిమరుపుకు సాధారణమైపోయింది. చీటికి మాటికి ఏదో ఒకటి మరిచిపోతూ ఉంటాం. దీంతో చాలా పనులు త్వరగా పూర్తి కావు. ఈ నేపథ్యంలో మతిమరుపు సమస్య వేధిస్తోంది. దీంతో మతిమరుపుతో పనులు మందగిస్తున్నాయి. మతిమరుపు రావడానికి బుధుడు మనకు మంచి చూపు లేకోవడమే అని వాస్తు శాస్త్రంలో చెబుతారు. ఇలా మతిమరుపుతో మనకు కష్టాలు రావడం సహజమే. దీంతో మతిమరుపు నుంచి బయట పడటానికి ఏం చేయాలో తెలుసుకుందాం. పుట్టగొడుగులు మతిమరుపును పోగొట్టే […]

Written By: Srinivas, Updated On : April 19, 2023 8:54 am
Follow us on

Food : ప్రస్తుత కాలంలో మతిమరుపుకు సాధారణమైపోయింది. చీటికి మాటికి ఏదో ఒకటి మరిచిపోతూ ఉంటాం. దీంతో చాలా పనులు త్వరగా పూర్తి కావు. ఈ నేపథ్యంలో మతిమరుపు సమస్య వేధిస్తోంది. దీంతో మతిమరుపుతో పనులు మందగిస్తున్నాయి. మతిమరుపు రావడానికి బుధుడు మనకు మంచి చూపు లేకోవడమే అని వాస్తు శాస్త్రంలో చెబుతారు. ఇలా మతిమరుపుతో మనకు కష్టాలు రావడం సహజమే. దీంతో మతిమరుపు నుంచి బయట పడటానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

పుట్టగొడుగులు

మతిమరుపును పోగొట్టే ఆహారాల్లో పుట్టగొడుగులు ముఖ్యమైనవి. వీటిని మశ్రూమ్స్ అంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మనకు మతిమరుపు సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇలా వీటిని తరచు తీసుకోవడం వల్ల మతిమరుపును దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా మతిమరుపు సమస్య లేకుండా పోతుందని చెబుతున్నారు. దీంతో డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మతిమరుపు నుంచి బయట పడొచ్చు. పరీక్షల సమయంలో వీటిని తింటే మన మతిమరుపుకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి.

చేపలు

మనకు మాంసాహారాల్లో ఉత్తమమైనది చేపలు. వీటిని తీసుకోవడం వల్ల అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాట్స్ వల్ల మనకు మతిమరుపు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా గుండె జబ్బుల నివారణ కూడా వీటితో సాధ్యమవుతుంది. అందుకే చేపలను రోజువారీ ఆహారంలో చేసుకోవడం వల్ల మనకు మంచి లాభాలు దక్కుతాయని చెబుతున్నారు.

గుడ్లు

ఆరోగ్యకరమైన ఆహారాల్లో గుడ్లు కూడా ముఖ్యమైనవి. ఇందులో 13 రకాల ప్రొటీన్లు ఉన్నాయి. దీంతో రోజు గుడ్లు తీసుకోవడం మంచిదే. అల్పాహారంలో గుడ్డు తీసుకుంటే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయని చెబుతున్నారు. వైద్యులు సైతం రోజుకో గుడ్డు తిని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచిస్తున్నారు. గుడ్డు తినడం వల్ల మనకు ఎన్నో రకాల మేలు కలుగుతుంది.

అవకాడో

పండ్లలో అవకాడో కూడా మెదడుకు మంచిదే. దీన్ని తినడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇంకా బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకు మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇలా ఈ ఆహారాలు రోజు తీసుకుని మన మెదడు పనితీరు మెరుగుపరచుకుని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags