Ind vs Ban : వాస్తవానికి ఇలాంటి అటాకింగ్ ఆట ను గత కొంతకాలం నుంచి ఇంగ్లాండ్ ఆడుతోంది. దానికి ఆ జట్టు బజ్ బాల్ గేమ్ అని పేరు పెట్టింది. కానీ ఇంగ్లాండ్ జట్టు ఈ ఏడాది జనవరి ప్రారంభంలో అలాంటి ఆట తీరు మనమీద ప్రదర్శించబోయింది. ఒక టెస్ట్ అలానే ఆడి గెలిచింది. ఆ తర్వాత భారత్ పుంజుకుంది. ఇంగ్లాండ్ జట్టుకు ఏ దశలోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. బజ్ బాల్ క్రికెట్ గేమ్ ను తుత్తునీయలు చేస్తూ అటాకింగ్ ఆట తీరును ప్రదర్శించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు సినిమా అర్థమైంది. ఆ తర్వాత బజ్ బాల్ గేమ్ ను కొద్దిరోజులు పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల శ్రీలంక జట్టుతో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. చివరి మ్యాచ్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ గేమ్ ను శ్రీలంక చివరి టెస్టులో పడుకోబెట్టింది. ఇక టీమ్ ఇండియా కూడా ఇంగ్లాండ్ మాదిరిగానే బంగ్లాదేశ్ జట్టు పై రెండవ టెస్టులో దూకుడు మంత్రాన్ని ఎంచుకుంది. స్వల్ప సమయంలోనే ఫలితాన్ని రాబట్టింది. దీనికి క్రికెట్ పరిభాషలో బజ్ బాల్ గేమ్ అని ఇంగ్లాండ్ పేరు పెట్టింది. కానీ దానికి టీమిండియా సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. అయితే ఇదే విషయాన్ని టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రముఖంగా ప్రస్తావించాడు.” బంగ్లాదేశ్ జట్టుతో రెండో టెస్టులో టీమిండియా దూకుడుగా ఆడింది. దానికి బజ్ బాల్ గేమ్ అని పేరు పెడుతున్నారు. కానీ అది బజ్ బాల్ గేమ్ కాదు.. అది గమ్ బాల్ అని” అశ్విన్ వ్యాఖ్యానించాడు.
అశ్విన్ చేసిన గమ్ బాల్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. కాన్పూర్ వేదికగా రెండో టెస్టు జరిగితే.. చివరి రెండు రోజుల్లో భారత్ ఫలితాన్ని రాబట్టింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది. వాస్తవానికి ఈ మైదానంపై ఫలితం రాబట్టడం అంతా సులభం కాదని క్రీడా విశ్లేషకులు భావించారు. కానీ రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వర్షం వల్ల రెండున్నర రోజులు మ్యాచ్ జరగకపోయినప్పటికీ.. చివరి రెండు రోజుల్లో భారత్ దూకుడు మంత్రాన్ని అమలులో పెట్టింది. బంగ్లాదేశ్ జట్టును పడుకోబెట్టింది.. అయితే టెస్ట్ క్రికెట్లో బజ్ బాల్ అనే గేమ్ ను ఇంగ్లాండ్ తెరపైకి తీసుకొచ్చింది. దానికి అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నట్టుగా టీమిండియా బంగ్లాదేశ్ పై దూకుడుగా ఆట తీరు కొనసాగించింది. దీంతో నెటిజన్లు ఈ అప్రోచ్ కు గమ్ బాల్ అని పేరు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పదం విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. టీ మీండియా విజయం సాధించిన అనంతరం అశ్విన్ కూడా గమ్ బాల్ వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే గం అనేది గౌతమ్ గంభీర్ పేరులోని తొలి అక్షరం. గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించి.. జట్టుకు అటాకింగ్ ఆట తీరును నేర్పాడు. అందువల్లే నెటిజన్లు బజ్ బాల్ ను కాస్తా గమ్ బాల్ చేశారు. అయితే ఇదే విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం.. కాగా రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు రన్ రేట్ ఏడుకు తగ్గకుండా పరుగులు చేయడం టెస్ట్ క్రికెట్లో సంచలనంగా మారింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ravichandran ashwin said that team india won against bangladesh because of the game of gum ball
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com