increase immunity: ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Increase Immunity: మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. విటమిన్ డి లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది సూర్యరశ్మి ద్వారా అందుతుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుంది. దీంతో మనకు అనారోగ్య సమస్యలు రావు. ఇది తక్కువ అయినా ఇబ్బందే ఎక్కువ అయినా తిప్పలే. శరీరంలో విటమిన్ డి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సూర్యరశ్మితో పాటు ఆహారాల ద్వారా కూడా విటమిన్ […]

Written By: Srinivas, Updated On : March 14, 2023 4:05 pm
Follow us on

Increase Immunity: మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. విటమిన్ డి లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది సూర్యరశ్మి ద్వారా అందుతుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుంది. దీంతో మనకు అనారోగ్య సమస్యలు రావు. ఇది తక్కువ అయినా ఇబ్బందే ఎక్కువ అయినా తిప్పలే. శరీరంలో విటమిన్ డి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సూర్యరశ్మితో పాటు ఆహారాల ద్వారా కూడా విటమిన్ డి దొరుకుతుంది. దీంతో మనం విటమిన్ డి అందించే ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.

విటమిన్ డి అధికమైతే కలిగే నష్టాల్లో మానసిక సమస్యలు, గందరగోళం, నిరాశ, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య తీవ్రత పెరిగితే కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకా కిడ్నీ సమస్యలు కూడా రావొచ్చు. సూర్యరశ్మి ద్వారా వచ్చే దాన్ని సన్ షైన్ విటమిన్ అని పిలుస్తారు. సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ డి లోపం వల్ల హైపర్ కాల్సెనియా మూత్ర పిండాల రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

విటమిన్ డి లోపిస్తే ఎముకలు, దంతాలు, కండరాలు దెబ్బతింటాయి. పిల్లల్లో రికెట్స్ వంటి ఎముక వైఫల్యాలకు దారి తీస్తుంది. పెద్దల్లో ాస్టియోమలాసియా అనే ఎముక నొప్పి రావడానికి కారణమవుతుంది. జుట్టు రాలడం, ఆకలి లేకపోవడం, తరచుగా జబ్బు పడటం, అలసట, ఎముక నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో విటమిన్ డి లోపించుకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే విటమిన్ డి అవసరం ఉంటుంది.

విటమిన్ లభించే ఆహారాల్లో పాలు, పుట్టగొడుగులు, చేపలు, సోయా పాలు, ఆరెంజ్ జ్యూస్ వంటి వాటిల్లో పుష్కలంగా లభిస్తుంది. దీంతో వీటిని తరచుగా తీసుకుంటే విటమిన్ డి లోపం ఉండదు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవడం ముఖ్యం. ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఉండాలంటే విటమిన్ డి అవసరం ఉంటుంది. శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందాలంటే రోజు కొంత సేపు ఎండలో నిలబడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుందని వైద్యులు సూచిస్తున్నారు.