Beauty Tips: అందంగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు

ఉదయం లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగాలి. అందులో నిమ్మరసం, తేనె వేసుకుంటే ఇంకా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఉదయం పూట మనం తాగే నీళ్లతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Written By: Srinivas, Updated On : May 26, 2023 5:13 pm

Beauty Tips

Follow us on

Beauty Tips: అందంగా కనిపించాలని అందరు ఆశపడుతున్నారు. దాని కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్నారు. అందంగా కనిపించడం కోసం అన్ని ఉపాయాలు పన్నుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏ టిప్ కనిపించినా వెంటనే చేస్తుంటారు. అందం కోసం వారు చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఈ నేపథ్యంలో అందంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ దాని కోసం అడ్డదారులు వెతకడం తప్పు. సులభమైన చిట్కాలతో అందం మన సొంతం చేసుకోవచ్చు.

ఉదయం లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగాలి. అందులో నిమ్మరసం, తేనె వేసుకుంటే ఇంకా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఉదయం పూట మనం తాగే నీళ్లతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉండకుండా పోతుంది. ఇంకా అందులో నిమ్మరసం, తేనె వేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అందం మనకు వశమవుతుంది.

స్నానం చేసేటప్పుడు కొబ్బరిపాలు కలుపుకుని స్నానం చేయడం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది. ఇంకా రోజు కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యం మన సొంతమవుతుంది. దీంతో అందం మనకు దాసోహం అవుతుంది. ఇలా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కానీ అందరు ఏవేవో సౌందర్య సాధనాలు వాడతారు. దీంతో సైడ్ ఎఫెక్ట్సే కానీ ఫలితం మాత్రం కానరాదు.

మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. ఇంకా గ్రీన్ టీ తాగితే ఎంతో మంచిది. ఉదయం పూట అల్పాహారంలో మిల్క్ షేక్ విత్ అరటిపండు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. దీంతో తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. దీంతో అందం దానంతట అదే వస్తుంది. కొబ్బరిపాలు, కొబ్బరి నూనెలతో వంటలు చేసుకుంటే ఆరోగ్యం మెండుగా ఉంటుంది. ఇలాంటి చిట్కాలు పాటించి అందంగా తయారు కావచ్చు.