Japan food safety rules: ప్రస్తుత కాలంలో మార్కెట్లో లభించే ఆహార పదార్థాలు చాలా వరకు కల్తీగా మారిపోతున్నాయి. అయితే కొన్ని ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాల్లో అనేక రకాల రసాయనాలు కలుపుతూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపార అభివృద్ధి ధ్యేయంగా భావించి నాణ్యతలేని వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా మార్కెట్లోకి నకిలీ వస్తువులను తీసుకొస్తున్నారు. అయితే జపాన్ దేశంలో మాత్రం ఇలాంటి ప్యాకెట్ ఆహార పదార్థాల్లో కఠినమైన నియమాలు ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని నిబంధనలు పాటిస్తాయి. ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
జపాన్ దేశంలో మార్కెట్ లో దొరికే ప్రతి ఆహారం ప్రోడక్ట్ పై నిబంధనలు పక్కాగా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి కల్తీ వస్తువులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు ముందుగానే నాణ్యమైన వస్తువులను తయారు చేస్తూ నిబంధనలను పాటిస్తూ ఉంటారు. వాటిలో ప్రతి ఆహార ఉత్పత్తి ప్యాకెట్ పై ఆహార పదార్థాలపై చేసిన పరీక్షలు, అనుమతులు, లేబుల్ రూల్స్ తప్పనిసరిగా ఉంటాయి. వీటిలో ఏ చిన్న పొరపాటు ఉన్న కంపెనీ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాలు తయారు చేసే ప్లాంట్లలో అంతర్జాతీయ హైజిన్ ప్రమాణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేతికి గ్లౌస్ వేసుకొని ప్రతిరోజు యంత్రాలను శుభ్రం చేస్తారు. ఏ చిన్న చెత్త కనిపించిన వెంటనే ఆ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు. అలాగే ఏదైనా ప్రోడక్ట్ లో కల్తీ అయినట్లు గుర్తిస్తే ఆ మొత్తం ఉత్పత్తిని ఆపేస్తారు. తిరిగి ఉత్పత్తి చేసిన తర్వాతనే మార్కెట్లోకి పంపిస్తారు.
జపాన్ దేశంలో ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే సంస్థల్లో నిల్వ పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతాయి. అలాగే కృత్తిమ రంగులు, రుచి కోసం రసాయనాలు కలపడంపై పరిమితులు ఉంటాయి. ప్రతి పదార్థంలో maximum residue limit (mrl) చాలా తక్కువగా నిర్ణయిస్తారు. ప్రతి ఉత్పత్తిపై పదార్థాల జాబితా, పోషక విలువలు, అలర్జీ గా ఉండే సమాచారం, తయారీ విలువలు తప్పనిసరిగా ముద్రిస్తారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ పదార్థం మార్కెట్లో ఎక్కువగా సేల్స్ కాకుండా ఉంటుంది.
అయితే మన దేశంలో మాత్రం ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు. ఒక పదార్థం ఉత్పత్తి చేయడానికి FSSAI నుంచి అనుమతి తీసుకున్నా.. అందుకు అనుగుణంగా కొన్ని సంస్థలు నిబంధనలు పాటించడం లేదు. పదార్థాల ఉత్పత్తిలో ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. లైసెన్స్ లు లేకుండా అని హైజిన్ ప్రమాణాలు పాటించడంలో లోపాలు ఉంటున్నాయి. చాలావరకు కల్తీ ఆహార ఉత్పత్తులు తయారు చేయడంతో ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు ప్యాకెట్ లేబుల్ పై ఒకరకంగా ఉంటే.. లోపల మరో రకంగా ఉంటుంది. అదే జపాన్లో ఒక పదార్థం ఎంత సైజులో ఉంటుంది? ఎలా ఉంటుంది? అన్నది కచ్చితంగా ప్యాకెట్ పై ముద్రిస్తారు.