Money Trap: టీనేజ్ రాగానే కొంతమంది యువకులు భవిష్యత్తు కెరీర్ పై ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు టీనేజ్ వయసును ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇందులో భాగంగా గర్ల్ ఫ్రెండ్ తో ఉండాలని అనుకుంటారు. అయితే గర్ల్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అని కొందరు ఫన్నీగా అంటూ ఉంటారు. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ ఉన్నవారు బైక్ కొనుగోలు చేయాలి.. షికార్లకు వెళ్లాలి.. రెస్టారెంట్లకు వెళ్లాలి.. వీటన్నింటికీ డబ్బులు కావాలి. అయితే కొంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నవారు రెస్టారెంట్ కి వెళ్దామంటే వద్దని చెప్పరు. అందులోనూ గర్ల్ ఫ్రెండ్ మొదటిసారిగా అడిగితే కాస్ట్లీ రెస్టారెంట్ కు వెళ్లడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఇలా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా?
కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త మోసాలు జరుగుతున్నాయి. కొందరు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇతరులను మాభ్యపెడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రెస్టారెంట్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అమ్మాయిల ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేసినట్లే చేసి.. రెస్టారెంట్కు తీసుకువెళ్తున్నారు. ఇలా పదేపదే రెస్టారెంట్ కు వెళ్లడం వల్ల వారి ఆదాయాన్ని పెంచుతున్నారు. ఆదాయం పెంచినందుకు వారికి కమిషన్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఒక యువకుడు ఇలా గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్లి భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అందువల్ల ఎవరైనా పదేపదే రెస్టారెంట్ కు వెళ్దామని అడిగితే రిజెక్ట్ చేయడమే మంచిది. అందులోనూ నిజంగా స్నేహం చేసేవారు ఎక్కువగా ఖర్చు పెట్టాలని అనుకోరు. సరదాగా ఉండాలని అనుకునేవారు కలిసి మాట్లాడతారు.. లేదా కష్టసుఖాలను చెప్పుకుంటారు. ఇలా ఎదుటివారిని పదేపదే రెస్టారెంట్ కు తీసుకెళ్లే వారిని అనుమానించాల్సిందేనని అంటున్నారు. అయితే ఇందులో మొత్తంగా రెస్టారెంట్ ఓనర్లు వేసే ప్లాన్లో భాగంగా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అబ్బాయిలు ఆర్థికంగా నష్టపోతే.. అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేసి వారి నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల ఏదైనా ఒక పని పదేపదే చేస్తున్న సమయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతేకాకుండా వస్తువుల కొనుగోలు విషయంలోనూ.. ఇతర ఖర్చు విషయంలోనూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కోసారి మోసపోయిన వారిలో లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచి అయినా ఎవరితోనైనా స్నేహం చేసే సమయంలో బాగా ఖర్చు పెట్టాల్సి వస్తే ఆ స్నేహం పై ఆలోచించాల్సిన అవసరం ఉంది.