Alcohol Food: చుక్క లేనిదే కొంతమందికి పొద్దు గడవదు. రోజంతా విధుల్లో మునిగి వారు సాయంత్రం రిలాక్స్ కోసం బార్ లేదా ఇంట్లో మద్యం తాగేవారు చాలా మంది ఉన్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నా.. రోజుకు రెండు పెగ్గులు తాగితే ఎలాంటి ప్రమాదం లేదని కొంతమంది నిత్యం మందు తాగుతూ ఉంటారు. అయితే మత్తు కోసం మద్యం సేవించినా ఈ సమయంలో కొంతమంది తీసుకునే ఆహారం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మందులోకి మసాలా ఉండాలని చాలా మంది స్పైసీ ఫుడ్ ను ఏర్పాటు చేసుకుంటారు. ఇది అప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ మరుసటి రోజు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. అయితే ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మందు తాగే ముందే కొన్ని రకాలా ఫుడ్స్ తీసుకోవచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకున్న తరువాత మద్యం సేవించినా ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని అంటున్నారు.
గుడ్డు: కొందరు మద్యం సేవిస్తూ ఎగ్ ను తీసుకుంటారు. గుడ్డులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మందు తాగుతూ గుడ్డును తినడం వల్ల ప్రోటీన్లు తీసుకుంటామని అనుకుంటారు. కానీ అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అల్కహాల్ సేవించే ముందే గుడ్డు తీసుకోవడం వల్ల ఆల్కహాల్ శోషణ ఆలస్యం అవుతుంది. దీంతో మరుసటి రోజు ఎలాంటి హ్యాంగోవర్ కు గురికాకుండా ఉంటారు.
అరటిపండు: అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ సమయాల్లో కూడా తినవచ్చు. అయితే మద్యం తీసుకునే ముందు అరటిపండు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మద్యం తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ గురవుతుంది. అదే ముందు అరటిపండు తినడం వల్ల ఎలక్ట్రోలెట్స్ ను సమతుల్యం చేస్తుంది. దీంతో శరీరం నిలకడ స్థితిగా ఉంటుంది.
చేపలు: కొంత మంది చేపలతో మద్యం తాగుతూ ఉంటారు. ఇలా చేస్తే మత్తు ఎక్కువగా వస్తుందని భ్రమ పడుతారు. కానీ చేపలు తింటూ మద్యం తాగడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు ఉన్నా మద్యంతో తీసుకోవడం అంతమంచిది కాదు. కానీ అల్కహాల్ సేవించే ముందు ఇవి తినడం వల్ల ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ష్ ఎంతో మేలు చేస్తాయి.
పెరుగు: జీర్ణక్రియకు పెరుగు మంచి ఔషధం లా పనిచేస్తుంది.చాలా మంది ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. మద్యం సేవించేవారు ముందు పెరుగును తినవడం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది. ఆ తరువాత ఆల్కహాల్ సేవించినా జీర్ణక్రియ సమస్యలు ఉండవు. ఇవే కాకుండా చియా సీడ్స్, అవకాడోలను కూడా మద్యం తాగే ముందు తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.