https://oktelugu.com/

Summer Health Tips: ఎండాకాలంలో ఏ ఆహారాలు తీసుకోకూడదో తెలుసా?

వేసవి కాలంలో మిల్క్ షేక్ తాగడం అంత మంచిది కాదు. దీని వల్ల కూడా అనారోగ్యం దరి చేరుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో స్వీట్లు ఉండటం వల్ల శరీరం తట్టుకోలేదు. వీటికి దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. ఇలాంటి వాటిని పట్టించుకుని మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. మిల్క్ షేక్ ను ఎండాకాలంలో తాగకూడదు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 6, 2023 8:12 am
    Follow us on

    Summer Health Tips: మనం ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. సీజన్ పరంగా కొన్ని ఆహారాలు తీసుకుంటే ఏర్పడే ముప్పు వల్ల మనం వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఈనేపథ్యంలో మనం తీసుకునే ఆహారాలు కాలానుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యం సహకరిస్తుంది. వేసవిలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.

    ఊరగాయ

    వేసవి కాలంలో అందరు ఊరగాయను తింటుంటారు. ఊరగాయల్లో ఉప్పు, నూనె, కారం అధికంగా ఉండటం వల్ల ఇబ్బందులొస్తాయి. దీంతో నిర్జలీకరణం అలసట, మైకం వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పచ్చళ్లు తింటే అంతేసంగతి. నోరు ఎండుకపోయి దాహం బాగా వేస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉంటేనే మంచిది.

    కాఫీ

    మనలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దీంతో ఇందులో ఉండే కెఫిన్ తో మనకు ఇబ్బందులు వస్తాయి. వాటర్ కంటెంట్ తగ్గి శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. కాఫీ, టీలకు బదులుగా మంచినీళ్లు తాగితేనే లాభం ఉంటుంది. కానీ కాఫీ, టీలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీని వల్ల ఎదురయ్యే సమస్యలను పట్టించుకోరు.

    మిల్క్ షేక్

    వేసవి కాలంలో మిల్క్ షేక్ తాగడం అంత మంచిది కాదు. దీని వల్ల కూడా అనారోగ్యం దరి చేరుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో స్వీట్లు ఉండటం వల్ల శరీరం తట్టుకోలేదు. వీటికి దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. ఇలాంటి వాటిని పట్టించుకుని మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. మిల్క్ షేక్ ను ఎండాకాలంలో తాగకూడదు.

    కారం

    కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవద్దు. కారంతో కడుపులో మంటలు పుడతాయి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో అసౌకర్యం కలుగుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. దీని వల్ల వేసవిలో కారం తినకుండా ఉండాలి. దాని వల్ల జరిగే నష్టాలను తెలుసుకుని ప్రవర్తిస్తేనే మనకు లాభాలుంటాయి. కడుపుకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కారానికి దూరంగా ఉండటమే మంచిది.

    డ్రై ఫ్రూట్స్

    మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ వల్ల పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అసౌకర్యం కలుగుతుంది. అలసటకు కారణమవుతుంది. కాల్చిన మాంసం ఈ కాలంలో అసలు తీసుకోకూడదు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని తినడం వల్ల సమస్యలు పెరిగేలా చేస్తుంది. అందుకే ఈ ఆహారాలను ఎండాకాలంలో తీసుకోకపోవడమే బెటర్.