https://oktelugu.com/

Salt : ఉప్పు అధికంగా వాడితే ఏ అనర్థాలు వస్తాయో తెలుసా?

Salt : ప్రస్తుత రోజుల్లో ఉప్పు వాడకం బాగా తగ్గించారు. పూర్వం రోజుల్లో ఉప్పు వాడకం ఎక్కువగా ఉండేది కాదు. మధ్యలో పెరిగింది. ఇప్పుడు చాలా మందికి అవగాహన ఏర్పడటంతో మానేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అజాగ్రత్తగా ఉంటున్నారు. ఉప్పు వాడకం పెంచుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఉప్పుతో నష్టాలు ఉప్పు అధికంగా వాడితే గుండె, కిడ్నీలు, రక్తపోటు వంటి వాటిపై ప్రభావం పడుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే మూత్రపిండాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 14, 2023 1:28 pm
    Follow us on

    Salt : ప్రస్తుత రోజుల్లో ఉప్పు వాడకం బాగా తగ్గించారు. పూర్వం రోజుల్లో ఉప్పు వాడకం ఎక్కువగా ఉండేది కాదు. మధ్యలో పెరిగింది. ఇప్పుడు చాలా మందికి అవగాహన ఏర్పడటంతో మానేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అజాగ్రత్తగా ఉంటున్నారు. ఉప్పు వాడకం పెంచుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు.

    ఉప్పుతో నష్టాలు

    ఉప్పు అధికంగా వాడితే గుండె, కిడ్నీలు, రక్తపోటు వంటి వాటిపై ప్రభావం పడుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కూడా ఉప్పే ప్రధాన కారణం. దీంతో మనం ఉప్పు అధికంగా తీసుకుంటే అనర్థాలే ఎక్కువగా వస్తాయి. దీంతో ఉప్పు వాడకం తగ్గించుకోకపోతే నష్టాలే. కానీ కొందరు మాత్రం లెక్కచేయడం లేదు.



    రుచి కోసమే..

    ఉప్పు మన శరీరంలోకి కేవలం రుచి కోసమే తీసుకుంటున్నాం. దీని వల్ల నష్టాలని తెలిసినా మానడం లేదు. మన శరీరంలో ఉప్పు ఉంటుంది. మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం రుచి కోసమని ఉప్పును ఆశ్రయిస్తున్నాం. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాం. అయినా మన తీరు మారడం లేదు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం.

    ఎలా తగ్గించాలి

    ఉప్పును ఒకేసారి మానేయడం వీలు కాదు. రోజుకు కొంత తగ్గిస్తూ పోతుండాలి. సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకపోతే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఎవరు కూడా లెక్కచేయడం లేదు. ఉప్పు వాడకం పెంచుకుంటే రోగాలు రావడం ఖాయం. అందుకే వీలైనంత వరకు ఉప్పును దూరం చేసుకుంటేనే మంచిది. రోగాలు లేని సమాజం కావాలంటే ఉప్పును దూరం పెట్టేందుకు చొరవ తీసుకోవాల్సిందే మరి.

    Tags