Bad Habits: మనల్ని పాడు చేసే ఈ అలవాట్లేంటో తెలుసా?

Bad Habits: ప్రస్తుతం కొన్ని అలవాట్లకు బానిసలం అవుతున్నాం. వాటిని మానలేకపోతున్నాం. వాటితో నష్టమని తెలిసినా వాటినే ఆశ్రయిస్తున్నాం. మన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో ప్రతిది మన అరచేతిలోనే ప్రత్యక్షమవుతోంది. దీంతో ఫోన్లలోనే లోకం చూస్తున్నారు. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అన్నట్లు అయిపోయింది. బిల్లులైనా, వ్యాపారమైనా ఏదైనా చిటికెలో అయిపోతోంది. ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. ఈ క్రమంలో […]

Written By: Srinivas, Updated On : January 6, 2023 6:18 pm
Follow us on

Bad Habits: ప్రస్తుతం కొన్ని అలవాట్లకు బానిసలం అవుతున్నాం. వాటిని మానలేకపోతున్నాం. వాటితో నష్టమని తెలిసినా వాటినే ఆశ్రయిస్తున్నాం. మన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో ప్రతిది మన అరచేతిలోనే ప్రత్యక్షమవుతోంది. దీంతో ఫోన్లలోనే లోకం చూస్తున్నారు. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అన్నట్లు అయిపోయింది. బిల్లులైనా, వ్యాపారమైనా ఏదైనా చిటికెలో అయిపోతోంది. ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. ఈ క్రమంలో మన పనులు చిటికెలో అయిపోతున్నాయి. శారీరక శ్రమ ఉండటం లేదు. ఎటు నడవాల్సిన అవసరం కూడా ఉండటం లేదు.

Bad Habits

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పోర్న్ వీడియోలు తెగ చూస్తున్నారు. దీంతో మన మనసు కంట్రోల్ లో ఉండదు. విద్యార్థులైతే చదువు, వ్యాపారులైతే వ్యాపారం, ఉద్యోగులైతే కెరీర్ పై ప్రభావం చూపుతుంది. ఎక్కువ సేపు వాటిని చూడటం వల్ల ఏదో అయిపోయినట్లు అనిపిస్తుంది. దేని మీద ఫోకస్ ఉండదు. ఫలితంగా మనం చేసే పని పూర్తి చేయకుండానే ఏదో జరిగినట్లు అనిపిస్తుంది. అందుకే పోర్న్ వీడియోల పట్ల ఆకర్షితులు కావడం అంత మంచిది కాదు.

రోజు ఉదయాన్నే స్నానం చేస్తాం. ప్రతి వారు వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ శరీరానికి వేడి నీరు అంత మంచిది కాదు. చన్నీటితోనే స్నానం చేయాలి. అలా చేయడం వల్ల మన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే నష్టాలే ఎక్కువ. దీంతో వేడినీటితో స్నానం చేస్తే అనర్థాలే ఎక్కువ కావడంతో చల్లనీ నీరే సురక్షితమని గ్రహించుకోవాలి. మన రోగ నిరోధక శక్తి పెరగాలంటే వేడి నీరు సురక్షితం కాదు. చన్నీటితోనే స్నానం చేయడం ఉత్తమమని తెలుసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

Bad Habits

ప్రతి రోజు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు. దీంతో జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు. చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఫోన్లు అంతలా ప్రభావం చూపుతున్నాయి. వారి కెరీర్ నే కొనసాగించలేకపోతున్నారు. ఫోన్లతో ఎంజాయ్ చేస్తున్నారు. మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల కళ్లపై ప్రభావం పడుతోంది. మన సమయం వృథా అవుతోంది. నిద్రను కూడా దూరం చేస్తుంది. ఇలా మన జీవితంపై పెను ప్రభావం చూపుతోంది. వీటిని వదిలేస్తేనే మన జీవితం బాగుంటుంది.

Tags