Romance : రతిలో పాల్గొనే సమయాలేంటో తెలుసా?

Romance :  అందరికి రతి అంటే ఇష్టమే. భార్యాభర్తల్లో బంధం బలపడాలంటే ఇది ఉండాల్సిందే. దీనికి ఎవరు కూడా అతీతులు కారు. రోజు ఆ పని చేస్తే మానసిక ఉత్తేజం కలుగుతుంది. తద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ నేపథ్యంలో రతిక్రీడకు అందరు సుముఖులే. కాకపోతే దానికి కొంత సమయం ఉండాల్సిందే. కానీ చాలా మంది సమయం సందర్భం లేకుండా రతిక్రీడ కోసం ఆరాటపడుతుంటారు. ఇది కరెక్టు కాదు. రతికి మంచి తరుణం ఉండాల్సిందే అంటున్నారు ఆరోగ్య […]

Written By: Srinivas, Updated On : October 26, 2023 4:34 pm
Follow us on


Romance : 
అందరికి రతి అంటే ఇష్టమే. భార్యాభర్తల్లో బంధం బలపడాలంటే ఇది ఉండాల్సిందే. దీనికి ఎవరు కూడా అతీతులు కారు. రోజు ఆ పని చేస్తే మానసిక ఉత్తేజం కలుగుతుంది. తద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ నేపథ్యంలో రతిక్రీడకు అందరు సుముఖులే. కాకపోతే దానికి కొంత సమయం ఉండాల్సిందే. కానీ చాలా మంది సమయం సందర్భం లేకుండా రతిక్రీడ కోసం ఆరాటపడుతుంటారు. ఇది కరెక్టు కాదు. రతికి మంచి తరుణం ఉండాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎప్పుడు పాల్గొనాలి?

జంతువులకైతే కొన్ని ప్రత్యేక కాలాలు ఉంటాయి. కానీ మనుషులకు ఎప్పుడు అనుకూలమే. దీంతో రతి జరిపేందుకు అన్ని కాలాలు ఉపయోగించుకుంటారు. దీంతో రతి ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో అనే విషయాల్లో కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. దీంతో మనం రతి చేసేందుకు కావాల్సిన సమయం కోసం వేచి చూడాల్సిందే. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

గర్భధారణ సమయంలో..

గర్భం దాల్చక ముందు రోజూ రతిలో పాల్గొనవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ అయ్యాక రతిలో పాల్గొనడం మంచిది కాదు. వైద్యులు ఏం కాదని చెబుతున్నారు కానీ ఆ సమయంలో రతి జరపడం క్షేమం కాదు. మన పూర్వీకులు గర్భధారణ చేశాక ఎప్పుడు కూడా అందులో పాల్గొనే వారు కాదు. అందుకే పుట్టే బిడ్డలు అంత ఆరోగ్యంగా ఉండే వారని విషయం చాలా మందికి తెలియదు.

ఇన్ఫెక్షన్లు

మన శరీరానికి ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు రతికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఆ సమయంలో రతిలో పాల్గొంటే అవి ఇతరులకు కూడా అంటుకోవచ్చు. అందుకే అలాంటి టైంలో రతికి టాటా చెప్పడమే ఉత్తమం. ఇంకా బహిష్టు సమయంలో కూడా రతికి మొగ్గు చూపకపోవడమే బెటర్. ఇలా రతి గురించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని తూచ తప్పకుండా పాటిస్తేనే మనకు సురక్షితం.

రక్షణ చర్యలు లేకుండా..

మనం రతిలో పాల్గొనే సమయంలో రక్షణ చర్యలు తీసుకుంటే మంచిది. కండోమ్ లు లాంటివి వాడటం వల్ల మనకు సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. గనేరియా వంటి సుఖ వ్యాధులు ఉంటే అవి అంటుకుంటాయి. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే సురక్షిత రతికి మనం ఇష్టపడాలి. అప్పుడే మనకు మంచి సేఫ్టీ ఉంటుందని నమ్మాలి. ఈ నేపథ్యంలో రతి క్రీడలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి.