Piles In Winter Season: శీతాకాలం ఆరంభమైంది. చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు చలి నుంచి కాపాడుకునేందుకు స్వెటర్లు ఆశ్రయిస్తున్నారు. ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం కాదు. నీరు కూడా తక్కువ తాగుతాం. దీంతో మన ఆహారం జీర్ణం కాకపోవడంతో మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఫైల్స్, ఫిషర్, పిస్టులా వంటి ఫైల్స్ సంబంధిత వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఫైల్స్ తో పాయువు సిరలు వాపు ప్రారంభమవుతాయి. చలి ముప్పు నుంచి రక్షించుకునేందుకు పలు చర్యలు తీసుకోవాల్సిందే.

ఫైల్స్ రోగుల్లో పాయువు లోపల, వెలుపల వాపు ఏర్పడుతుంది. మలం మీద ఒత్తిడితో ఫైల్స్, మొటిమలు రావడం జరుగుతుంది. ఫైల్స్ ఉన్న వారు ఆహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఫ్రైలు తినకూడదు. మాంసాహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. అల్కహాల్ అసలు తీసుకోకూడదు. శుద్ధి చేసిన ధాన్యాలు, ఉప్పు అధికంగా తీసుకుంటే నష్టమే. చలికాలంలో ఫైల్స్ సమస్య పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తగిన శ్రద్ధ తీసుకుని ఆహారాలు తీసుకుంటే ప్రయోజనం.
ఈకాలంలో హెమరాయిడ్స్ ఎక్కువగా ఉండటంతో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతోనే ఫైల్స్ వచ్చే సూచనలున్నాయి. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఫైల్స్ కేసులు ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం సురక్షితం. పైల్స్ రావడానికి ప్రధాన కారణం ఎక్కువ సేపు కూర్చోవడమే. కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా వదులుగా ఉండేవి వేసుకోవాలి.

ఫైల్స్ ను నియంత్రించడానికి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే ఫైల్స్ సమస్య నుంచి దూరం కావచ్చు. ఫైల్స్ నివారణకు పలు చర్యలు తీసుకోవాలి. సుమారు 15 నిమిషాల పాటు సిట్జ్ స్నానం చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయాలి. మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను తీసుకోవద్దు. కొవ్వు, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే ప్రమాదమే. పండ్లు, కూరగాయల రసం తీసుకుంటే ఇంకా లాభమే.