Raavi Chettu Pooja: ఇంట్లో కొడుకు కుటుంబానికి రక్షణగా ఉంటే… బయట ఉన్న చెట్టు ఎంతోమందికి నీడగా ఉంటుంది.. అందుకే పుట్టిన ప్రతి బిడ్డ పేరున ఒక చెట్టును నాటాలని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని చెట్లను దేవతలుగా కొలుస్తారు. వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటిలో రావి చెట్టును ప్రధానంగా పూజిస్తారు. రావి చెట్టును పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎంతోకాలంగా పెళ్లి కాని వారికి.. సంతానం కలగాలనుకునే వారికి.. వ్యాపారంలో లాభాలు రావాలననే వారు రావి చెట్టుకు పూజ చేయడం పూజలు చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు.
ప్రతి శనివారం రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల నష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అయితే రావి చెట్టుకు ఎలా పూజ చేయాలి ?ఎటువంటి సందర్భంలో పూజలు చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం..
రావి చెట్టును అశ్వత్థ విష్ణు వృక్షంగా పేర్కొంటారు. రావి చెట్టు వేర్లలో విష్ణువు.. కాండంలో శివుడు.. కొమ్మల్లో పరబ్రహ్మ ఉంటారని చెబుతూ ఉంటారు.. అందుకే ఈ చెట్టు కింద ఎన్నో పూజలు, యాగాలు కూడా నిర్వహిస్తుంటారు. కొందరు పరమ భక్తులు రావి చెట్టు కింద పరమవ దించడానికి ముందుకు వస్తారు. సకల దేవతలకు గురువు రావి చెట్టు అని స్కంధ పురాణంలో పేర్కొనబడింది. అందువల్ల రావి చెట్టును పూజించడం వల్ల సకల శని దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే రావి చెట్టును ఏ రోజు పూజించాలి? ఎలా పూజించాలి? అనేది తెలుసుకుందాం..
ఎంతోకాలంగా పెళ్లి కాని వారు, పుత్ర సంతానం లేని వారు, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు రావి చెట్టు కింద పూజలు చేయడం వల్ల ఫలితాన్నిస్తుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా రావి ఆకులపై దీపం పెట్టడం వల్ల శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడని అంటారు. దీని ఆకులు కాండం చెట్టు వైపు ఉండేలా పెట్టి వాటిపై దీపాలు ఉంచాలని అంటున్నారు. ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి రావి ఆకులపై ఉంచాలి. ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల సత్ఫలితాలు ఇస్తుందని భక్తులు పేర్కొంటున్నారు. అయితే రావి చెట్టుకు ఇంట్లో కూడా పూజలు చేయవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఇంట్లో అయితే నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆలయాల్లో ఉండే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో వెలిగించడం ఉత్తమం. ఇలా 21 రోజుల శనివారాలు పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని చెబుతున్నారు.
రావి చెట్టును కేవలం పూజల కోసమే కాకుండా ఔషధాల్లో దీని బెరడు ను ఉపయోగిస్తారు. అందువల్ల రావి చెట్టు మిగతా వాటి కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది.