Devotional Tips: హిందువులలో చాలామంది దేవుడిని నమ్ముతారనే సంగతి తెలిసిందే. దేవుడిని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది బలంగా విశ్వసిస్తారు. అయితే గుళ్లలో తీర్థం ఇచ్చే సమయంలో పూజారులు అకాల మృత్యు హరణం చదువుతారు. “అకాల మృత్యు హరణం.. సర్వ వ్యాధి నివారణం.. విష్ణు పాదోదకం పావనం” అని చదువుతారు. ప్రతి మనిషికి చావుకు సంబంధించి కొన్ని గండాలు ఉంటాయి.
ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి పంతులు గారు తీర్థం ఇచ్చే సమయంలో అకాల మృత్యు హరణం మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదవడం వల్ల భక్తులకు అకాలంగా మృత్యువు రాకుండా ఉండటంతో పాటు సర్వ పాపాలు తొలగిపోయే అవకాశాలు ఉండటంతో పాటు మనకు మంచి జరుగుతుంది. ప్రతి వ్యక్తి వీలైన ప్రతిసారి గుడికి వెళ్లడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.
ఆలయంలో ఉండే శ్రీచక్రం మన ఆత్మకు మన ఆరాకు ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇలా నిజంగా జరుగుతుంది. వాస్తవానికి మనిషి సంపూర్ణ ఆయుష్షు 120 సంవత్సరాలు కాగా 60 సంవత్సరాల లోపు మనిషి మరణిస్తే అకాల మృత్యువుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదని ఆత్మహత్య చేసుకోవడం వల్ల మరుజన్మలో నికృష్టమైన జీవితం గడపాలని పురాణాలు చెబుతున్నాయి.