Relationships: శృంగారం బంగారంతో సమానం అంటారు. అంటే అంత పవిత్రంగా చూసుకోవాలనేది దాని సారాంశం. కానీ ఇటీవల కాలంలో శృంగారం విచ్చలవిడి ప్రక్రియగా మారిపోతోంది. మనిషి జంతువు నుంచి వచ్చాడనే నానుడినే నిజం చేస్తూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు దానికి విలులే లేకుండా చేస్తున్నారు. పూర్వం రోజుల్లో శృంగారమంటే గుట్టుగా సాగే వ్యవహారంగా మాత్రమే పరిగణించేవారు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు శృంగారం కూడా హద్దులు దాటుతోంది.

సామాజిక మాధ్యమాల ప్రభావంతతో ప్రతిది సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది దీంతో అసలు గుట్టు అనేది లేదనే విషయం అందరికి తెలిసిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా విచ్చలవిడితనానికే అలవాటుపడిపోతున్నారు. ఫలితంగా శృంగారం వ్యభిచారంలా అనిపిస్తోంది. రెండు గోడల మధ్య సాగాల్సిన పనిని పదిమందిలో కూడా చేస్తున్నారు. ప్రదర్శనకు అంతగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
Also Read: AP Power Cuts: ఏపీలో విద్యుత్ కోతలు ఇంకా పది రోజులే..
సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి దాన్ని షేర్ చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. తెల్లవారి లేచింది పడుకునే వరకు ఏ పని చేసినా దాన్ని సామజిక మాధ్యమాల్లో పెట్టడం పరిపాటిగా మారింది. ఈ సంస్కృతి ఇంకా ఎక్కడకో దారి తీస్తుంది. కొందరైతే పడక గది రహస్యాలను సైతం సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు. సమాజాన్ని మేల్కొలిపే విషయాలు పెడితే సరే కానీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం దారుణం.

పూర్వ కాలంలో కూడా శృంగారాన్ని ఇష్టపడ్డారు. ఇంతలా బరితెగించలేదు. ఇప్పుడు పశువులకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. పశువైతే దానికి ఓ కాలం ఉంటుంది. అదే కాలంలో అది సంభోగానికి సిద్ధమవుతుంది. కానీ మనిషి అలా కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తనకు దొరికిన సమయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నాడు. పైగా దానికి లైకులు ఎన్ని వస్తాయో అని ఎదురుచూపులు.

నాగరికత పేరుతో మనుషులు మారిపోతున్నారు. అది మంచికైతే ఫర్వాలేదు కానీ పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన పవిత్రమైన భావాలను ఇతరులకు పంచుతూ రాక్షసత్వాన్ని పెంచుకుంటున్నాడు. జీవిత భాగస్వామికి ఇష్టమున్నా లేకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా జుగుస్సాకరమైన విధంగా పోస్టులు పెడుతూ వంచనకు గురవుతున్నారు. ఈ విధానం మారాలి. మనుషుల్లో మార్పు రావాలి.. గుప్తంగా ఉంచుకునేందకు శృంగారం ఉందని గుర్తించాలి. అప్పుడే ఈ బాధల నుంచి విముక్తి అవుతారు. రాబోయే కాలంలో మనుషులు మారి సామాజిక మాధ్యమాల వాడకం తగ్గిస్తేనే మంచిదనే అభిప్రాయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
Also Read:Minister KTR on BJP Campaign: ప్రజాసంగ్రామ యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర. మంత్రి కేటీఆర్ ఆగ్రహం