Red beets : ఎర్ర దుంపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండరు

అలాగే మలబద్దకం, పేగు, జీర్ణ సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. దీనిని ఎక్కువగా వేపుడు కూర వండికుని తినవద్దు. వేయించిన ఆహారం వల్ల జీర్ణ సమస్యలు తగ్గకుండా ఇంకా పెరుగుతాయి.

Written By: NARESH, Updated On : September 22, 2024 9:56 pm

Red Potatoes

Follow us on

Red beets : రోజువారీ కూరల్లో బంగాళ దుంపలు లేకుండా ఎవరూ వంట చేయరు. ప్రతి కూరలో టేస్ట్ కోసం తప్పకుండా బంగాళదుంపను వాడుతారు. అయితే సాధారణంగా బంగాళదుంపలు తెలుపు రంగులో ఉంటాయి. చాలామందికి వీటి గురించే తెలుసు. కానీ ఎర్రగా ఉండే బంగాళదుంపల గురించి అంతగా ఎవరికీ తెలియదు. తెల్ల బంగాళదుంపలను తినడం వల్ల కాళ్ల వాపు వస్తాయని వైద్యులు చెబుతుంటారు. వీటిని ఎక్కువ మంది తినరు. కానీ ఎర్రగా ఉండే బంగాళ దుంపలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఈ ఎర్ర బంగాళదుంపలను పహారీ బంగాళదుంపలు అని కూడా పిలుస్తారు. ఇవి పంజాబ్ నుంచి ఎక్కువగా వస్తాయి. ఇవి తినడానికి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఎర్ర బంగాళదుంపలను ఎక్కువగా చిప్స్, పరోటా, చాట్, సలాడ్ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఎర్ర బంగాళదుంపలో బోలెడన్నీ పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిగా తెలిస్తే అసలు తినకుండా ఉండరు. మరి పహారీ దుంపల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఎర్ర బంగాళదుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడటంలో సహాయపడుతుంది. చాలామందికి రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి విముక్తి చెందాలంటే అప్పుడప్పుడు అయిన ఎర్ర బంగాళదుంపలను తినడం ఆరోగ్యానికి మంచిది.

రక్తపోటును నియంత్రిస్తుంది
పొటాషియం ఎక్కువగా ఎర్ర బంగాళదుంపల్లో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండెపోటు రాకుండా సహాయపడుతుంది. ఈ దుంపల వల్ల ఎలాంటి కీళ్ల నొప్పులు ఉండవు. వారానికి ఒకసారి ఈ ఎర్ర బంగాళదుంపలను తినడం వల్ల శరీరానికి బలం వస్తుంది. నీరసంగా అనిపించకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
ఎర్ర బంగాళదుంపల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్దకం, పేగు, జీర్ణ సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. దీనిని ఎక్కువగా వేపుడు కూర వండికుని తినవద్దు. వేయించిన ఆహారం వల్ల జీర్ణ సమస్యలు తగ్గకుండా ఇంకా పెరుగుతాయి.

మానసిక ఆరోగ్యం
ఎర్ర బంగాళదుంపల్లో ఉండే విటమిన్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. వీటిని డైలీ డైట్‌‌లో చేర్చుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలకు పెట్టడం వల్ల వాళ్లు చదువులో రాణిస్తారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.