Working : రోజుకి 14 గంటలు పనిచేసి ఒత్తిడికి గురైన యువతి ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ఇలా గంటల తరబడి వర్క్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వర్క్ అంతా కంప్యూటర్లతోనే పని ఉండటంతో స్కీన్ ముందు గంటల తరబడి కూర్చుని వర్క్ చేస్తున్నారు. మనిషికి తిండి, నిద్ర, బట్ట ఎంత ముఖ్యమై ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మరీ ముఖ్యంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. సాధారణంగా ఆఫీస్‌లో రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ఈ రోజుల్లో చాలా కంపెనీలు రోజుకి 14 నుంచి 15 గంటలు పాటు వర్క్ చేయించుకుంటున్నాయి. దీంతో చాలా మంది ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అసలు కదలకుండా ఒకే ప్లేస్‌లో కూర్చుని కంప్యూటర్ల ముందు అతుక్కుపోతున్నారు. దీంతో లేనిపోని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. విశ్రాంతి తీసుకోకుండా అధికంగా వర్క్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవుతారు. ఇలానే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరానికి నిద్ర, విశ్రాంతి తప్పనిసరి. ఎక్కువ గంటలు పనిచేసిన దానికి తగ్గ విశ్రాంతి బాడీకి ఇవ్వాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి లేకుండా రోజుకి ఎక్కువ గంటలు పనిచేస్తే మెదడు దెబ్బతింటుంది. ఒత్తిడికి లోనయ్యి.. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. అదే కూర్చుని ఎక్కువ గంటలు పనిచేసే వాళ్లలో అయితే ఊబకాయం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఒకే ప్లేస్‌లో ఉండి.. గంటల తరబడి పనిచేస్తే మెదడు ఒత్తిడికి గురి అవుతుంది. దీంతో చేసే పని కూడా సరిగ్గా చేయలేరు. పనిచేసే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే చేసే పని మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేకపోతే సరైన సమయానికి ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. అంతా గందరగోళంగా ఉంటుంది.
వర్క్ మధ్యలో విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల బాడీ బాగా అలసిపోతుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణ జరగక.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కువ గంటలు పనిచేయవద్దు. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఐదు నుంచి పది నిమిషాలకు ఒక విరామం తీసుకోవడం మంచిది. కొందరు వర్క్ బిజీలో పడి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోరు. దీనివల్ల అనారోగ్య సమస్యల వస్తాయి. కాబట్టి ఎంత బిజీలో ఉన్న ఫుడ్‌ని అసలు తీసుకోవడం మానేయవద్దు. రోజంతా నీరు ఎక్కువగా తాగడంతో పాటు తాజా పండ్లు, రసాలు, ఆకుకూరలు, పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవాలి. పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే రన్నింగ్, వాకింగ్, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. బయట వాతావరణంలో ఇలా చేయడం వల్ల కాస్త ప్రశాంతత లభిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.