https://oktelugu.com/

నల్ల బియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

మనలో చాలామంది తెల్ల బియ్యంతో వండిన అన్నం ఆహారంగా తీసుకుంటారు. అయితే చాలామంది తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ మంచిదని చెబుతున్నారు. తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా బ్లాక్ రైస్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇతర బియ్యాలతో పోల్చి చూస్తే బ్లాక్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని రైతులు మాత్రమే పండిస్తున్నారు. Also Read: శరీరంలో వేడి తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..? సాధారణంగా వచ్చే బియ్యం […]

Written By: Kusuma Aggunna, Updated On : January 1, 2021 12:40 pm
Follow us on


మనలో చాలామంది తెల్ల బియ్యంతో వండిన అన్నం ఆహారంగా తీసుకుంటారు. అయితే చాలామంది తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ మంచిదని చెబుతున్నారు. తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా బ్లాక్ రైస్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇతర బియ్యాలతో పోల్చి చూస్తే బ్లాక్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని రైతులు మాత్రమే పండిస్తున్నారు.

Also Read: శరీరంలో వేడి తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

సాధారణంగా వచ్చే బియ్యం దిగుబడితో పోలిస్తే బ్లాక్ రైస్ సాగు చేయడం ద్వారా అక్కడి రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు. బ్లాక్ రైస్ లో ఆంథోసైయనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆంథోసైయనిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆంథోసైయనిన్లు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడంలో సహాయపడతాయి.

Also Read: పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

బ్లాక్ రైస్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఈ రైస్ లో ఉండే పీచు పదార్థం షుగర్ లెవెల్స్ ను అదుపు చేయడంలో సహాయపడుతుంది. బ్లాక్ రైస్ సాగుకు చీడపీడల బాధ ఉండదు. అందువల్ల రైతులు బ్లాక్ రైస్ ను సాగు చేసినా నష్టపోయే అవకాశం ఉండదు. విటమిన్ ఇ, మెగ్నిషియం, ఇనుము, జింక్, కాల్షియం బ్లాక్ రైస్ ద్వారా మన శరీరానికి లభిస్తాయి. రోజూ బ్లాక్ రైస్ తో వండిన అన్నం తింటే ఒబెసిటీ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

బ్లాక్ రైస్ కంటి సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. రోజూ బ్లాక్ రైస్ తో వండిన అన్నం తీసుకునే మహిళలు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీలైతే నల్ల బియ్యంతో వండిన అన్నం తిని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.