ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక.. క్రైస్తవాన్ని స్వీకరించిన వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఒక పద్ధతి ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో మచ్చుకు ఒకటి కూడా వెలుగుచూడని ఈ దాడులు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నెలకో దాడి జరుగుతోంది.
Also Read: కొత్త ఏడాదిలో కేటీఆర్ కు పట్టాభిషేకం?
కొన్ని రోజుల నుంచి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగిపోయింది. తాజాగా విజయనగరం జిల్లాలో హనుమాన్ విగ్రహ ధ్వంసం కలకలం రేపింది. వీటిని ఆధారంగా చేసుకొని ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ పాలనలో ఇలా జరుగుతున్నాయని రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ దాడులను నిగ్గుతేల్చాలని కూడా వైసీపీ సర్కార్ పట్టుదలగా ఉంది.
తాజాగా దాడుల వెనుక గల కారణాలను ఏపీ పోలీసులు తెలుసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.ఏపీలో విగ్రహాల విధ్వంసంపై ఉన్నత అధికారులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్న ప్రముఖ బ్యాంకులు.. ఎలా పొందాలంటే..?
ఏపీలో విగ్రహాల విధ్వంసం ఘటనలు దారుణమని సీఎంజగన్ వాపోయారు. దేవుళ్ళ విగ్రహాలతో చెలగాటమాడే వారిని దేవుడే శిక్షిస్తాడని ఆయనవ్యాఖ్యానించారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని జగన్ ఆరోపించారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఉదంతాలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్