https://oktelugu.com/

ఈ నూనె వంటల్లో వాడితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ప్రస్తుతం మార్కెట్ లో మనకు రకరకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వంటనూనెలో మనం ఏ ఆయిల్ ను ఉపయోగిస్తాం..? ఏ ఆయిల్ మానకు ఆరోగ్యాన్ని ఇస్తుంది..? అనే సందేహాలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లను ఎక్కువగా మనం వంటల్లో వినియోగిస్తాం. వీటితో పాటు ఆవ నూనెను కూడా చాలామంది వంటల్లో వినియోగిస్తారు. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆవనూనె వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని తేలింది. […]

Written By: , Updated On : October 19, 2020 / 08:22 AM IST
Follow us on

ప్రస్తుతం మార్కెట్ లో మనకు రకరకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వంటనూనెలో మనం ఏ ఆయిల్ ను ఉపయోగిస్తాం..? ఏ ఆయిల్ మానకు ఆరోగ్యాన్ని ఇస్తుంది..? అనే సందేహాలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లను ఎక్కువగా మనం వంటల్లో వినియోగిస్తాం. వీటితో పాటు ఆవ నూనెను కూడా చాలామంది వంటల్లో వినియోగిస్తారు.

అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆవనూనె వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని తేలింది. చాలామంది ఆవనూనె వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని భావించి ఆవనూనె ఖరీదు ఎక్కువైనప్పటికీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. టెంపుల్ యూనివర్శిటీకి చెందిన లూయీస్ క్యాట్జ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆవ నూనె గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఎవరైతే ఆవ నూనెను వంటల్లో వాడతారో వాళ్లలో మెదడు చురుకుగా పని చేయదని, జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ వివరాలను వెల్లడించారు. ఆవ నూనెను వినియోగించే వాళ్లు బరువు కూడా పెరుగుతారని చెప్పారు.

పచ్చళ్ల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్న ఈ నూనెను వాడకపోవడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎలుకలపై ఏడాది పరిశోధనలు చేయగా ఆవ నూనె తీసుకున్న ఎలుకల్లో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అమీలాయిడ్ ఫలకాల స్థాయి పెరిగినట్టు గురించారు. ఆవ నూనె వల్ల న్యూరాన్ల పనితీరు దెబ్బ తిన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే ఆవ నూనె వల్ల ప్రయోజనం లేకపోయినా ఆలివ్ నూనె వాడితే మాత్రం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.