ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐ తాజాగా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వినియోగదారులు బ్యాంక్ కు కూడా వెళ్లకుండా వాట్సాప్ ద్వారా బ్యాంక్ లకు సంబంధించి సంపాదించే అవకాశం కల్పించింది.
ఐడీబీఐ బ్యాంక్ ఈ సర్వీసులను వాట్సాప్ వెరిఫైడ్ నెంబర్ ద్వారా అందిస్తోంది. ఇతర యాప్ లతో వాట్సాప్ కు సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాట్సాప్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉండదు. ఐడీబీఐ కొన్ని సర్వీసులను ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
వాటాస్ప్ బ్యాంకింగ్ ద్వారా ఐడీబీఐ బ్యాంకు కస్టమర్లు సమీపంలోని ఏటీఎంల వివరాలు, ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచు వివరాలు, వడ్డీ రేట్లు, ఈమెయిల్ స్టేట్‌మెంట్, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ చేసుకోవడం, చివరి ఐదు లావాదేవీలు, అకౌంట్ బ్యాలన్స్ సమాచారం తెలుసుకోవచ్చు. ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో రాకేశ్ శర్మ వాట్సాప్ సేల్వలను అందుబాటులోకి తీసుకురావడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో మాత్రమే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే పలు బ్యాంకులు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ సర్వీసులను వాట్సాప్ ద్వారా బ్యాంకులు అందిస్తూ ఉండటంపై పలువురు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.