డిగ్రీ విద్యార్థులకు నెలకు 5 వేల రూపాయలు.. ఎలా పొందాలంటే..?

దేశంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక యూనివర్సిటీలు, ఐఐఎస్సీలు, ఐఐటీలు ఫెల్లోషిప్ లను అందజేస్తున్నాయి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు డిగ్రీ సైన్స్ విద్యార్థులకు 5 వేల రూపాయలు స్కాలర్ షిప్ గా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫెలోషిప్స్ ను కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందిస్తుంది. డిగ్రీ సైన్స్ చదువుతున్న విద్యార్థులు ఆసక్తి ఉంటే ఈ ఫెల్లోషిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By: Navya, Updated On : October 19, 2020 8:13 am
Follow us on

దేశంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక యూనివర్సిటీలు, ఐఐఎస్సీలు, ఐఐటీలు ఫెల్లోషిప్ లను అందజేస్తున్నాయి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు డిగ్రీ సైన్స్ విద్యార్థులకు 5 వేల రూపాయలు స్కాలర్ షిప్ గా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫెలోషిప్స్ ను కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందిస్తుంది.

డిగ్రీ సైన్స్ చదువుతున్న విద్యార్థులు ఆసక్తి ఉంటే ఈ ఫెల్లోషిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. http://kvpy.iisc.ernet.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు డిగ్రీ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. http://kvpy.iisc.ernet.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసే విద్యార్థులు తగిన అర్హతలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పేరు, పుట్టినతేదీ, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఇతర వివరాలను రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇతర డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయడంతో పాటు ఫోటోగ్రాఫ్, సంతకం అప్ లోడ్ చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్ కోర్సులు , బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యార్థులు ఈ ఫెల్లోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ విద్యార్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున, పీజీ విద్యార్థులకు నెలకు 7,000 రూపాయల చొప్పున ఫెల్లోషిప్ అందుతుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు 1,250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 625 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి పరీక్ష కేంద్రాలు కాగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.