Clay Pot Health Benefits: ఎండాకాలంలో నీరు తాగడం సహజమే. దీంతో మనం ప్రతి రోజు ఐదు లీటర్ల మంచినీరు తాగాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని వల్ల ఇబ్బందులొస్తాయి. ఈ నేపథ్యంలో శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉండేందుకు నీరు దోహదపడుతుంది. మనలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు. కానీ కుండలో నీళ్లు తాగడం మంచిది.
మట్టి కుండలో నీళ్లు ఉంచితే సహజంగా చల్లబడుతుంది. కుండ ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు ఆవిరవువుతంది. భాష్పీభవన ప్రక్రియలో భాగంగా కుండ లోపల నీరు వేడెక్కుతుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీంతో కుండలో నీరు చల్లగా ఉంటుంది. ఫ్రిజ్ వాటర్ కంటే కుండలోని నీరే ఎక్కువ చల్లగా మారుతుంది. మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది.
మట్టికుండలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడతాయి. దీని వల్ల శరీరంలో ఇతర వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. వడదెబ్బ ముప్పు రాకుండా నిరోధిస్తుంది. ఈ నేపథ్యంలో మట్టి కుండలోని నీటిని తాగేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇందులో కాలుష్య కారకాలు కూడా లేకుండా పోతాయి.
ఫ్రిజ్ కంటే మట్టికుండే మంచిది. అందుకే ఫ్రిజ్ వాడే వారు కూడా కుండనే ఆశ్రయిస్తున్నారు. మట్టి కుండలో ఉండే పోషకాల వల్ల మనం కుండలోని నీరు తాగేందుకు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. మట్టికుండలో మంచి పోషకాలు ఉండటం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో మట్టి కుండను వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.