Gray Pumpkin Juice : ఉదయం బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

బూడిద గుమ్మడికాయ రసం తాగితే శరీరం డీటాక్స్ చేసుకుంటుంది. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్ తాగితే మేథో శక్తి పెరుగుతుంది.

Written By: Srinivas, Updated On : June 28, 2023 3:35 am
Follow us on

Gray Pumpkin Juice : మనం ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే గుమ్మడికాయ కట్టుకుంటాం. బూడిద గుమ్మడికాయను కూరగా కూడా వండుకుంటారు. రసం తీసుకుని తాగుతారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. బూడిద గుమ్మడికాయ రసం తాగితే శరీరం డీటాక్స్ చేసుకుంటుంది. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్ తాగితే మేథో శక్తి పెరుగుతుంది.

మలబద్ధకానికి మందు

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అంతర్గత వ్యవస్థ శుద్ధి కావడానికి ఇది సాయపడుతుంది. కాల్షియం, ఐరన్, పాస్పరస్, విటమిన్ సి లు శరీరానికి బలం చేకూరుస్తాయి. మలబద్ధకానికి ఇది మంచి మందులా ఉపయోగపడుతుంది. దీని జ్యూస్ తాగితే మలవిసర్జన సాఫీగా సాగుతుంది.

మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి..

బూడిద గుమ్మడి కాయను పొడిగా చేసుకుని కొబ్బరినీళ్లు, నిమ్మరసం, ఉసిరి రసంతో కలిపి తాగితే గ్యాస్ట్రో ఎంట్రిక్ సమస్యలు దూరం చేస్తుంది. రోజు దీని జ్యూస్ తాగే వారికి మాదక ద్రవ్యాలకు బానసైన వారు కూడా ఆ అలవాటును మానుకుంటారు. తక్కువ బరువు ఉన్నవారు దీన్ని తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. పోషక విలువలు పెరుగుతాయి.

మంచి నిద్ర కోసం..

బూడిద గుమ్మడి కాయలో అల్కలైన్ బాడీ అంటే శరీరంలో ఎసిడిటిని తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టేందుకు దోహదడుతుంది. ఇతర వ్యాధులు ఉన్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. కడుపు ఉబ్బరం నుంచి దూరం కావచ్చు. కిడ్నీలు ఎక్కువ సోడియంను యూరిన్ ద్వారా బయటకు పంపించేందుకు బూడిద గుమ్మడికాయ ఉపయోపడుతుంది.