Drinking Water : మంచినీళ్లు అతిగా తాగినా అనర్థమే తెలుసా?

Drinking Water : ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది. దీంతో దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. నీళ్లు తక్కువ తాగితే శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. అన్నం తినడం ఎంత ముఖ్యమో నీళ్లు తాగడం కూడా అంతే. దీంతో కొందరు బాటిల్ దగ్గరే ఉంచుకుంటారు. ఎప్పుడు దాహంగా ఉంటే అప్పుడు నీళ్లు తాగుతుంటారు. ఇది సరైన పద్ధతే. కానీ కొందరు మాత్రం దాహం వేయకున్నా బాటిళ్ల కొద్ది నీళ్లు తాగుతుంటారు. […]

Written By: Srinivas, Updated On : April 2, 2023 1:03 pm
Follow us on

Drinking Water : ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది. దీంతో దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. నీళ్లు తక్కువ తాగితే శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. అన్నం తినడం ఎంత ముఖ్యమో నీళ్లు తాగడం కూడా అంతే. దీంతో కొందరు బాటిల్ దగ్గరే ఉంచుకుంటారు. ఎప్పుడు దాహంగా ఉంటే అప్పుడు నీళ్లు తాగుతుంటారు. ఇది సరైన పద్ధతే. కానీ కొందరు మాత్రం దాహం వేయకున్నా బాటిళ్ల కొద్ది నీళ్లు తాగుతుంటారు. ఇది ప్రమాకరం. అతి అనేది ఎందులో కూడా మంచిది కాదనే విషయం తెలుసు. ఇలా మంచి నీళ్లు తాగే పద్ధతులు కొన్ని ఉన్నాయి.

ఎప్పుడు తాగాలి?

నీళ్లు ఎప్పుడు తాగాలనే ఆలోచన అందరికి రావడం సహజమే. ఉదయం లేవగానే ఓ లీటర్ పావు తాగాలి. ఓ అరగంట ఆగి మళ్లీ ఓ లీటర్ పావు తాగాలి. ఇలా రెండు సార్లు తాగితే సుఖమైన మలవిసర్జన జరుగుతుంది. దీంతో ఒంట్లో ఉండే మలినాలు బయటకు పోతాయి. ఇక అల్పాహారం చేసే ముందు ఓ గ్లాసు తాగాలి. తరువాత గంటన్నరకు మళ్లీ ఓ గ్లాసు తాగాలి. మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు మళ్లీ ఓ గ్లాసు తాగాలి. గంటన్నర తరువాత అరగంటకోసారి నీళ్లు తాగొచ్చు. ఇలా రోజులో ఐదు లీటర్ల నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం.

నీరు తాగకపోతే..

వేసవి కాలంలో నీళ్లు తాగకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోవడం జరుగుతుంది. తొందరగా చికిత్స తీసుకోకపోతే అంతే సంగతి. ఇలా నీళ్ల ప్రాధాన్యం గుర్తించి రోజు నీళ్లు తాగేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగే వారి మెదడులో ఉండే ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు చాలా చురుగ్గా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. దీంతో వారు ఏం తినాలన్నా, నమలాలన్నా ఇబ్బందులు పడతారట.

దాహం వేస్తేనే..

వేసవి కాలం కదా అని ఇష్టమొచ్చినట్లు నీళ్లు తాగకూడదు. అలా తాగితే హైపోవెట్రిమియా అనే సమస్య వస్తుంది. దీని వల్ల కణాల వాపు రావడం, కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. అందుకే నీళ్లు అతిగా కాకుండా మోతాదులో తాగడమే మంచిది. ఏ ప్రాణికైనా జలమే జీవనాధారం. నీళ్లు తాగని జీవి ప్రపంచలోనే లేదు. అందుకే నీరు మనకు అంతటి ప్రాధాన్యం ఉన్న వనరు అయింది. ఇలా మంచినీళ్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మన చేతిలో నీరే కదా అని అతిగా తాగడం సరైన పద్ధతి కాదు.