Winter Health Problems: ప్రస్తుతం చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరు చలి నుండి రక్షణ కోరుకుంటారు. ఎండ నైనా తట్టుకుంటారు కానీ చలి తీవ్రత ను మాత్రం అస్సలు తట్టుకోలేరు.
దీంతో చలి నుండి రక్షణ కోసం చాలామంది వేడివేడి పదార్ధాలను తినడానికి ఇష్టపడుతుంటారు. దీనివల్ల శరీరంలో కాస్త వేడి ప్రభావం ఉంటుందని ఎప్పటికప్పుడు వేడి వేడి పదార్థాలు తింటుంటారు. దీంతో చలి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక కొందరు ఆరుబయట మంటలతో చలి నుండి ఉపశమనం పొందుతారు.
Also Read: తగ్గేదే లే అంటున్న క్రికెటర్ రవీంద్ర జడేజా
వీటి ద్వారా ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ కొందరు మాత్రం ఈ చలికాలం సమయంలో మద్యం సేవించడానికి బాగా ఇష్టపడుతుంటారు. కారణం ఈ సమయంలో మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కాస్త వేడి తగులుతుందని అనుకుంటారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం లేదు. మద్యం సేవిస్తున్నంతసేపు శరీరం బాగా వెచ్చబడి ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత శరీరం పూర్తిగా చల్లబడుతుంది. దాంతో ఆల్కహాల్ చలిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది.
దీనివల్ల శరీరానికి బాగా వణుకు పుట్టడం వంటివి జరగటంతో కొన్ని సందర్భాలలో గుండె పనితీరు కూడా ఆగిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి చలికాలంలో మద్యం సేవించే వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మరికొందరు ఈ సమయంలో పొగ తాగుతూ ఉంటారు. దీనివల్ల కూడా శరీరానికి వేడి కలుగుతుందని అనుకుంటారు. కానీ ఇది కూడా శరీరానికి చాలా డేంజర్ అని ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలుపుతున్నారు.
Also Read: క్రిస్మస్ ట్రీ పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా?