Sonal Chauhan: అక్కినేని నాగార్జున ఈ ఏడాది సూపర్ హిట్ లేదని చెప్పాలి. తన తనయులు నాగచైతన్య ,అఖిల్ ఈ ఏడాది వరుస విజయాలు అందుకున్నారు. వచ్చే ఏడాదైనా సూపర్ హిట్ అందుకోవాలని మంచి ఫామ్లో ఉన్నారు నాగార్జున. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని హుటాహుటిగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అలానే మరో చిత్రం అయినా” ఘోస్ట్” కూడా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ను ఎవరు అనేది ఇంకా తేలియలేదు.

Also Read: సమంత పాటపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కాజల్‌ను ఎంపిక చేసుకున్నారు.కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది కాజల్ పర్సనల్ రీజన్స్ తో తప్పుకుంది. ఆమె స్థానంలో మరో కథానాయికను ఎంపిక చేసేందుకు మేకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. కాజల్ తప్పుకోవడంతో త్రిష పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇది రూమర్ అని తేలిపోయింది.ఇటీవలే గా అమలా పాల్, మెహరీన్‌ల పేర్లు వినిపించాయి కానీ, చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.తాజగా మరో హీరోయిన్ కింగ్‌తో జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
లెజెండ్, పండగ చేస్కో, షేర్, డిక్టేటర్ చిత్రాల్లో కనిపించిన సోనాల్ చౌహాన్ ‘ఘోస్ట్’లో నటించబోతుదంట. ఇప్పటికే సోనాల్ చౌహాన్ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3లో ఒక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఘోస్ట్ లో నాగ్ కు జోడీగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి మరి ఈ వార్త ఎంతవరకు వాస్తవం అవుతాయో.
Also Read: ఆంధ్రాలో పుష్ప చిత్రానికి భారీ దెబ్బ…!