Radhe Shyam Trailer Talk: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే మేకర్స్ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా జీవితంలో లో ప్రేమ పెళ్లి లేవు’ అంటూ ప్రభాస్ వాయిస్ తో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
ఇక ‘ప్రేమ పెళ్లి లేవు’ అంటూనే.. ఇంట్రెస్ట్ గా కనిపించిన అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే కుర్రాడిగా ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. టాల్ బ్యూటీ పూజా హెగ్డే (ప్రేరణ) ఎంట్రీ కూడా అదిరిపోయింది. నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు..’ అంటూనే పూజా హెగ్డే పై ప్రేమను కురిపిస్తూ ఆమెను ప్రేమలో పడేశాడు ప్రభాస్.
ఇక ప్రభాస్ పాత్ర విషయానికి వస్తే.. గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ పూర్తిగా కొత్త పాత్రలో కనిపించాడు. ‘పుట్టుక నుంచి చావు దాకా.. ఏ రోజు ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు’ అంటూ తన పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ‘ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంత చదవ గలవో చూస్తాను’ అంటూ పూజా హెగ్డే.. ప్రభాస్ కి తన చేయిని అందించింది.
దీనికి ‘కాలం రాసిన చందమామ కథలా నీ ప్రేమకథ ఉంటుంది.. నీ ప్రేమ ఎదురవడం వరం, కాని దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం’ అని ప్రభాస్ చెప్పడంతో ట్రైలర్ మలుపు తిరిగింది. ప్రభాస్ – పూజా హెగ్డే ప్రేమకథలో జ్యోతిష్యం కీలక పాత్ర పోషించబోతున్నట్లు, ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందనే సెన్స్ తో కొన్ని షాట్స్ పడ్డాయి.
ఈ క్రమంలో ట్రైన్ మరియు షిప్ మునిగిపోవడం, అలాగే భూకంపం రావడం వంటి విజువల్స్ అదిరిపోయాయి. ‘విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?’ అని ప్రభాస్ చెప్పే డైలాగ్ ‘రాధే శ్యామ్’ సినిమా ఎలా ఉండబోతుందో ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
Also Read: RRR vs Radheshyam: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?
మొత్తమ్మీద ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. పూజా కూడా చాలా అందంగా కనిపించింది. ఇక పరమహంస పాత్రలో కృష్ణంరాజు మెరిసారు. ఏది ఏమైనా ‘రాధే శ్యామ్’ ట్రైలర్ లో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.