https://oktelugu.com/

Eggs : రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? ఒకటి కంటే ఎక్కువ తినవచ్చా?

ఎగ్స్ తినడం చాలా మందికి ఇష్టం. కానీ కొందరికి కష్టం. అయితే వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు ఒక యాపిల్ తినాలి అంటారు వైద్యులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 27, 2024 / 01:00 AM IST

    eggs

    Follow us on

    Eggs : ఎగ్స్ తినడం చాలా మందికి ఇష్టం. కానీ కొందరికి కష్టం. అయితే వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు ఒక యాపిల్ తినాలి అంటారు వైద్యులు. అదే విధంగా ఒక ఎగ్ కూడా తినాలి అని సలహా ఇస్తారు. ఈ గుడ్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మీరు కూడా గుడ్డు ప్రియులు అయితే ప్రతి రోజు ఒక ఎగ్ తినండి. మరి రోజు ఒకటి మాత్రమే తింటున్నారా? అంతకంటే ఎక్కువ కూడా తినేస్తున్నారా? ఇంతకీ రోజు ఒక గుడ్డు కంటే ఎక్కువ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అయితే ఈ ఆర్టికల్ లో చూసేద్దాం.

    గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చలికాలంలో గుడ్లు తింటే శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకే మాంసాహారులు మాత్రమే కాదు శాకాహారులు కూడా గుడ్లు తినడం అలవాటు చేసుకుంటారు. తమను తాము ఎగ్టేరియన్లు అని బిరుదు కూడా ఇచ్చుకుంటారు. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు కాల్షియం కూడా ఉంటుంది. అందుకే గుడ్లు తినడం వల్ల శీతాకాలంలో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

    క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా మందికి అలవాటే. ఇలాంటి వారు అంటే ఈ బాడీ బిల్డర్లు అల్పాహారంగా గుడ్లు తినడం మంచిది. అయితే కొందరు పచ్చసొన తినరు. ఈ సొనలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే బరువు పెరుగుతారు అని దాన్ని స్కిప్ చేస్తారు. అందుకే కేవలం ప్రోటీన్, కాల్షియం కోసం గుడ్డులోని తెల్లసొనను తింటారు.

    అయితే గుడ్లలో కూడా రెండు ప్రధాన రకాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. నాటు గుడ్లు, బాయిలర్ గుడ్లు. నాటు కోడి గుడ్లు, ఊర్లల్లో దొరికుతాయి. ఈ గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. అయితే బాయిలర్ గుడ్లు తెలుపు రంగులో ఉండి ఎక్కడి అయినా ఎక్కువగా లభిస్తాయి. కాస్త తక్కువ ధరకే లభిస్తాయి కూడా. ఇక బాయిలర్ గుడ్లతో పోలిస్తే నాటు కోడి గుడ్లు చాలా ఖరీదు ఎక్కువ. ఇక వీటిలో రకాలు మాత్రమే కాదు తినే స్టైల్ లో కూడా తేడా ఉంటుంది. కొందరు ఉడకబెట్టిన గుడ్డును తింటే కొందరు ఆమ్లెట్ తింటారు. కొందరు కూరతో తింటారు.

    అయితే రోజు ఒక గుడ్డు పూర్తిగా తినవచ్చు. ఆ తర్వాత కూడా మీరు తినాలి అనుకుంటే మాత్రం గుడ్డులోని పచ్చసొన లేకుండా తినాలి. ఇలా తినాలి అనుకుంటే ఆమ్లెట్ తో తినడం కష్టం. పచ్చసొనను వేరు చేయలేరు. ఇక పచ్చసొన లేకుండా మీరు ఏకంగా ఒక రోజు నాలుగు గుడ్లు అయినా తినేయవచ్చు అంటున్నారు నిపుణులు.