Homeహెల్త్‌Reverse Walking Benefits: రివర్స్ వాకింగ్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Reverse Walking Benefits: రివర్స్ వాకింగ్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Reverse Walking Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరి అని చాలామందిలో అవగాహన ఇప్పటికే వచ్చింది. దీంతో ఉదయం లేవగానే వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే వాకింగ్ క్రమ పద్ధతిలో చేయడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని గంటల పాటు నడక కొనసాగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే సాధారణంగా వాకింగ్ అనగానే ముందుకు నడుస్తూ ఉంటారు. కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. సాధారణ వాకింగ్ కాకుండా ఒక్కోసారి స్పీడ్ గాను.. మరోసారి స్లో గాను నడవడం వల్ల గుండెకు మెయిల్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే కొత్తగా ఇప్పుడు వెనక్కి నడవాలని.. ఇలా నడిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అసలు వెనక్కి వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సి ఉంది. వ్యాయామంలో భాగంగా నడక తప్పనిసరి. నడక వల్ల శరీరంలో ప్రతి ఒక్క అవయం కదలికగా ఉంటుంది. కొన్ని గంటలపాటు.. కనీసం 1000 అడుగులు వేయడం వల్ల రక్తప్రసరణ వేగంగా మారి గుండె పనితీరు మెరుగు పడుతుంది. అంతేకాకుండా కండరాలు పటిష్టంగా మారుతాయి. ఉత్సాహం వచ్చి రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇవన్నీ ముందుకు నడవడం వల్ల ఉండే ప్రయోజనాలు. అయితే వెనక్కి నడవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

వెనక్కి నడవడం వల్ల స్లోగా వెళ్తాము. ఇలాంటి సమయంలో ముందుగా కాలివేళ్లపై ఒత్తిడి పడుతుంది. ఆ తర్వాత అరికాళ్లపై ఒత్తిడి పడుతుంది. కాళీ వీళ్లపై ఒత్తిడి పడడం వల్ల వీటి నరాలతో లింక్ అయి ఉన్న అవయవాలు ఆక్టివ్ అవుతాయి. అలాగే అరికాలు పూర్తిగా భూమిపై ఆనించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగంగా మారుతుంది. ఇలా వెనక్కి నడవడం వల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే వెన్ను నొప్పితో బాధపడే వారికి రిలాక్స్ అవుతారు.

ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. దీంతో బరువు తగ్గాలని అనుకునేవారు ఇలా వెనక్కి నడవడం వల్ల తొందరగా ఫలితం ఉంటుంది. రివర్స్ వాకింగ్ వల్ల మెడ నొప్పులు తగ్గుతాయి. అలాగే కండరాలపై ప్రత్యేకంగా వెయిట్ పడడం వల్ల ఇవి పటిష్టంగా మారుతాయి. కొన్ని రకాల గాయాల నుంచి కూడా బయటపడవచ్చు. ముఖ్యంగా వెనక్కి నడవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. విద్యాభ్యాసంలో ఉన్నవారికి రివర్స్ వాకింగ్తో సృజనాత్మకత పెంపొందుతుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు వెనక్కి నడిచే ప్రయత్నం చేయాలని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular