Sleeping Left Side: మానవ శరీర ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. సరైన నిద్ర కూడా అంతే అవసరం. అయితే నిద్రపోయే సమయంలో కొందరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నిద్రించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరు నిద్రించే సమయంలో ఇష్టం వచ్చినట్లు పడుకుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్రించే సమయంలో ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు ఇలా నిద్రిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మనం రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత నిద్రిస్తాం. ఈ సమయంలో తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇలా పడుకోవడం వల్ల పేగుల గుండా ఆహారం ముందుకు కదులుతుంది. ముఖ్యంగా పెద్ద పేగు సహజ దిశలో పనిచేయడం వల్ల మలబద్ధకం సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ గ్యాస్ తగ్గడానికి ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇలా నిద్రించడం వల్ల ఆమ్లం పైకి ఎగరకుండా కడుపులోనే జీర్ణం అయ్యే విధంగా ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది.
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెకు మేలు కూడా జరుగుతుంది. ఎందుకంటే గుండెపై ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా ఎలాంటి కలలు కూడా రాకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇలా నిద్రించడం వల్ల కాలేయం సమస్యలు కూడా ఉండవు. మానవ శరీరంలో కాలేయం కుడివైపు ఉంటుంది. అయితే కుడివైపు పడుకుంటే కాలేయంపై ఒత్తిడి పడుతుంది. అలాకాకుండా ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడకుండా విష పదార్థాలు శరీరం నుంచి తొలగించేందుకు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా నిద్రించడం వల్ల శిశువుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. అలాగే వెన్నునొప్పి, కాళ్ల వాపులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే లింప్ డ్రైనేజ్ ఎడమవైపు బాగా జరుగుతుంది.
ప్రస్తుత కాలంలో చాలామందికి శ్వాస ఇబ్బందులు ఉండడం వల్ల గురక ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. ఈ గురక రాకుండా ఉండాలంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది అని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా నిద్రించడం వల్ల శాసనాలు తెరుచుకొని గురక తగ్గుతుంది. ఈ విధంగా సాధ్యమైనంతవరకు ఎడమవైపు నిద్రించే ప్రయత్నం చేయాలి. అయితే ఎడమవైపు తిరిగి పడుకున్నా కూడా సరైన వాతావరణంలో నిద్రించడం మంచిది. తలకింద శుభ్రమైన దుస్తులను ఉంచి.. మెదడుకు ఒత్తిడి లేకుండా ఉండాలి. అలాగే నిద్రించేముందు మొబైల్ చూడకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.