Urvasivo Rakshasivo Premiere Talk: అల్లు శిరీష్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో చిత్రంతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. నవంబర్ 4న ఈ రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ విడుదలైంది.యూఎస్ లో ప్రీమియర్ షోస్ ముగిశాయి. క్రిటిక్స్, ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా పట్ల తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రంతో మెప్పించాడు అనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. రొటీన్ కథకు కమర్షియల్ హంగులు అద్ది దర్శకుడు ఎంటర్టైనింగ్ తీర్చిదిద్దాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఊర్వశివో రాక్షసివో కథ విషయానికి వస్తే… సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన శ్రీకుమార్(అల్లు శిరీష్) తన కొలీగ్(సింధు)ని ఇష్టపడతాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. అయితే సింధుకు శ్రీకుమార్ కి తెలియని బ్యాగ్రౌండ్ ఉంటుంది. సింధు నేపథ్యం ఏమిటీ? శ్రీకుమార్ ప్రేమ ఫలించిందా? కోరుకున్న సింధును దక్కించుకున్నాడా? సింధు-శ్రీకుమార్ ల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.
దర్శకుడు రాకేష్ శశి ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని రొమాన్స్, కామెడీ, లవ్ , ఎమోషనల్ అంశాలతో పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్, రొమాంటిక్ సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. లీడ్ పెయిర్ లిప్ లాక్ సన్నివేశాలు హద్దులు దాటేశాయని తెలుస్తుంది. ఇంటిమసీ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించిన శిరీష్, అను ఇమ్మానియేల్ యూత్ కి ఫుల్ కిక్ ఇచ్చారంటున్నారు. ఇక ప్రేమ కథలో రాకేష్ రాసుకున్న కామెడీ పూర్తి స్థాయిలో ఆకట్టుకుంది.

సమయానుసారంగా వచ్చే కామెడీ నవ్వులు పూయిస్తూ వినోదం పంచుతుంది. ఐటీ ఆఫీస్ సన్నివేశాల్లో వెన్నెల కిషోర్, శిరీష్ కామెడీ సన్నివేశాలు మెప్పించాయనేది క్రిటిక్స్ ఒపీనియన్. డీసెంట్ మ్యూజిక్, ఉన్నత నిర్మాణ విలువలు ఉర్వశివో రాక్షసివో చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దాయి. రొటీన్ కథ, ఎమోషనల్ సన్నివేశాలు, అంతగా ప్రభావం చూపని క్లైమాక్స్ నెగటివ్ పాయింట్స్ గా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఊర్వశివో రాక్షసివో మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఎంటర్టైనింగ్ సాగుతుందని అంటున్నారు.