Coconut Water: వేడి ఎక్కువ ఉన్న సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని గుర్తుపెట్టుకోండి. అందుకే డాక్టర్లు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి అని చెబుతుంటారు. ఇక సమ్మర్ లో గాలి వచ్చేలా దుస్తులు వదులుగా ఉండేలా ధరించాలి అనిపిస్తుంటుంది. ఇక హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు, ద్రవాలు, కొబ్బరి నీరు తీసుకోవాలి అని సలహా ఇస్తుంటారు డాక్టర్లు. మరి కొబ్బరి నీళ్ల ప్రయోజనం ఏంటో మీకు తెలుసా? అయితే ఓ లుక్ వేయండి.
పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ లకు కొబ్బరి నీరు మూలమట. ఇవి శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతాయట. ఇవి ఆర్ద్రీకరణకు అవసరం అంటారు నిపుణులు. చెమట వల్ల కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందడానికి సహాయ పడుతుంది కొబ్బరి నీరు. చక్కెర, అధిక కేలరీలు ఉండే పానీయాల కంటే కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయం కొబ్బరి నీరు. ఇది నిర్జలీకరణానికి దోహదం చేస్తుందట. ఇందులో సహజ శీతలీకరణ లక్షణాలు ఉంటాయి.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో, వేడి ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కాల్షియం, ఐరన్ విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వేడి ఉన్న సమయంలో ఇవి చాలా ముఖ్యం. వేడి ఒత్తిడి కారణంగా శరీరం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
కొబ్బరిని స్మూతీస్ లో కలపడం లేదా మోజిటోస్ వంటి కాక్ టెయిల్ లకు పునాదిగా ఉపయోగించడం వంటి వివిధ రకాలతో పాటు వివిధ మార్గాల్లో లేత కొబ్బరిని తీసుకోవచ్చు. అంటే లేత కొబ్బరి శీతలీకరణ రుంచి, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే వేసవి తాపాన్ని అధిగమించవచ్చు.