Positive mindset : జీవితంలో ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే సరిపోదు.. మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా సాధించానికి బాడీ సపోర్ట్ చేసినంత ఈజీగా మైండ్ సపోర్ట్ చేయదు. దీనిని మనమే మన ఆధీనంలో ఉంచుకోవాలి. కొందరు బయటకు చాలా ఆనందంగా కనిపిస్తారు. కానీ వాళ్లు మనసులో భయంగా, ఆందోళనగా ఏదో ఆలోచిస్తుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ల మీద వాళ్లకు నమ్మకం కూడా ఉండదు. ఏ విషయంలోనైనా నెగిటివ్‌గా ఆలోచిస్తారు. అయితే పాజిటివ్ థింక్ చేసే వాళ్లకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మరి మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తున్నట్లే.
పాజిటివ్ ఆలోచనలు రావాలంటే మొదటిగా చేయాల్సింది తొందరగా లేవడం. రోజును బాధతో కాకుండా సంతోషంగా పాజిటివ్ ఆలోచనలతో ప్రారంభించండి. ఏదో ఆలోచిస్తూ నిరాశగా ఉండకుండా నవ్వుతూ డేను స్టార్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేటుగా రోజుని ప్రారంభిస్తే చిరాకుగా ఉంటుంది. కాబట్టి తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. లేటుగా నిద్రపోయిన తొందరగా లేచే అలవాటు ఉంటే రోజంతా మీరు యాక్టివ్‌గా ఉంటారు. ఏ పనినైన చిటికెలో చేయగలగను అనే పాజిటివ్ ఆలోచనతో ఉంటారు. కొంతమందికి ఏ పని చెప్పిన నేను చేయలేను ఇది, నా వల్ల కాదని అంటుంటారు. ఈ టైప్ మెంటాలిటీ అంత మంచిది కాదు. ఏదైనా నేను చేయగలను, నా వల్ల అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో లైఫ్‌లో ముందుకు వెళ్లాలి.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేయడం సహజం. చేసిన తప్పులను గుర్తుచేసుకుంటూ బాధపడవద్దు. గతాన్ని ఎంత తొందరగా మర్చిపోతే జీవితంలో అంతపైకి వెళ్తారు. మీ బాధను తీర్చడానికి ఎవరూ మీతో ఉండరు. మీకు మీరే బాధను పోగొట్టుకుని సంతోషంగా ఉండాలి. చిన్ని చిన్న సంతోషాలను స్వీకరిస్తూ ముందుకుపోవాలి. ఈ పని నేను చేయలేను.. నేను వేస్ట్. ఎందుకు ఈ లైఫ్ అని బాధపడుతూ కూర్చోవద్దు. కష్టమైన, నష్టమైన మీరు అనుకున్నది చేసేయండి. మంచి జరిగినా, చెడు జరిగినా నవ్వుతూ మళ్లీ ప్రయత్నించాలి. అసలు ఇదే జీవితమంటే. సంతోషం వస్తే ఎగిరి గెంతేసి, బాధ వస్తే కుంగిపోవద్దు. రెండింటిలో ఏది వచ్చిన ఒకేలా ఉండండి.
ఒక్కసారి జీవితంలో ఓడిపోతే ఇంకా ఎప్పటికీ గెలవలేమని కొందరు భావిస్తారు. కానీ ఇది వందశాతం తప్పు. ఎందుకంటే సక్సెస్ ఎవరి లైఫ్‌లో ఎలా, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఒకసారి ఓడిపోతే ఇంకోసారి గట్టిగా పోరాడాలి. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పనిచేసుకుంటూ పోవాలి. పక్కవాళ్లు ఏమనుకుంటారని వాళ్లను పట్టించుకోకుండా జీవితంలో మీరు ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఒంటరిగా బాధపడుతూ కూర్చోవద్దు. అందరితో కలిసిమెలసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. పెయింటింగ్ వేయడం, వంటలు చేయడం, యోగా, పుస్తకాలు చదవడం వంటివి అలవాటు చేసుకోండి. ఏ విషయంలోనైనా నెగిటివ్ చూడకుండా పాజిటివ్ చూడండి. ఎవరి మీద కూడా కోపంగా ఉండవద్దు. చిన్న చిన్న తప్పులను క్షమించేయండి. ఎవర్ని విమర్శించకుండా వాళ్లను, వారి ఇష్టాలను గౌరవించడం మొదలుపెట్టండి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Do you have these qualities but you have a positive mindset
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com