Chicken: మనలో చాలామంది మాంసాహారం ఎక్కువగా తినడాన్ని ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఆదివారం వచ్చిందంటే చాలా చికెన్ తో చేసిన వంటకాలను తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. అయితే చికెన్ తినేవాళ్లకు వేర్వేరు సందేహాలు వేధిస్తుంటాయి. చికెన్ తినేవాళ్లలో కొందరు విత్ స్కిన్ తినడానికి ఇష్టపడితే మరి కొందరు వితౌట్ స్కిన్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. చికెన్ తో చేసిన వంటకాలు తినడం వల్ల బరువు పెరుగుతామనే సంగతి తెలిసిందే.
అదే సమయంలో చికెన్ వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. అయితే చికెన్ ను స్కిన్ తో తీసుకున్నా స్కిన్ లెస్ తీసుకున్నా మరీ అతిగా మాత్రం తీసుకోకూడదు. చికెన్ ను ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో వాళ్లను గుండె జబ్బులతో పాటు బీపీ, కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చికెన్ హార్మోన్ లను క్రమబద్ధీకరించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమేనా?
చికెన్ లో శాచురేటెడ్ కొవ్వుతో పాటు అన్ శాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. స్కిన్ తో ఉన్న చికెన్ తింటే అది తక్కువ నూనెను గ్రహిస్తుంది కాబట్టి మరీ మంచిది. స్కిన్ లెస్ చికెన్ లో స్కిన్ తో ఉన్న చికెన్ తో పోలిస్తే క్యాలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బాగా ఉడకబెట్టిన మాంసంను తింటే మాత్రమే ఆరోగ్యానికి మంచిది. ఉడికీఉడకని మాంసం తినడం ద్వారా శరీరానికి నష్టమే అని చెప్పవచ్చు.
జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్న సమయంలో చికెన్ కు దూరంగా ఉంటే మంచిది. జ్వరం వచ్చిన సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
Also Read: యూపీని షేక్ చేస్తున్న అతిపెద్ద సమస్య.. తీర్చేవారిదే ఈసారి గెలుపు?