https://oktelugu.com/

గ్రీన్ టీ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

బరువు తగ్గాలని భావించే వాళ్లలో చాలామంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. రోజుకు 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీని అస్సలు తాగకూడదు. గ్రీన్ టీని ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య వేధించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 15, 2021 / 09:28 PM IST
    Follow us on

    Green Tea Benefits

    బరువు తగ్గాలని భావించే వాళ్లలో చాలామంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. రోజుకు 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీని అస్సలు తాగకూడదు. గ్రీన్ టీని ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య వేధించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

    రోజూ గ్రీన్ టీని తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినే అవకాశం ఉంటుంది. రోజూ గ్రీన్ టీ తాగేవాళ్లలో హార్మోన్ల స‌మ‌స్యలు వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గ్రీన్ టీని రోజూ తాగితే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఎక్కువ‌గా శోషించుకోలేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. రోజూ గ్రీన్ టీ తాగేవాళ్లను అసిడిటీ సమస్య వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

    గ్రీన్ టీని అధికంగా తాగేవాళ్లలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ గ్రీన్ టీ తాగేవాళ్లకు రక్తప్రసరణ వేగం పెరిగి హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ రోజూ తాగేవాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. కప్పుల కొద్దీ గ్రీన్ టీని తాగితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

    గ్రీన్ టీ వల్ల కొన్ని లాభాలు ఉన్నా లాభాలతో పోలిస్తే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో చెడు కొవ్వు కరగడంతో పాటు గుండె జ‌బ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల గ్రీన్ టీని పరిమితంగా తీసుకుంటే మంచిది.