Positive Mindset: అంతా మన మంచికే.. అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి చెడు జరిగినా కూడా.. అంతా మన మంచికే అని ధైర్యం చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఒక చెడు వెనుక ఒక మంచి ఉంటుంది అనేది.. మహాభారతం కాలం నుంచి వస్తున్న వాస్తవం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు రెండు ఉంటాయి. కానీ మంచి జరిగినప్పుడు ఎవరు బాధపడరు. చెడు జరిగితే మాత్రం ఆవేదన చెందుతూ ఉంటారు. కొందరు తమ జీవితం వ్యర్థం అని ప్రాణాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి సమయంలో ఎలా ఆలోచించాలంటే?
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని ఉంటుంది. ఇందులో భాగంగా అవకాశాలు.. సందర్భాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇదే సమయంలో తనకు అదృష్టం కూడా ఉండాలని అనుకుంటాడు. కానీ అవకాశాలు ఒక్కోసారి వస్తుంటాయి. వాటిని వినియోగించుకోలేక కొందరు అభివృద్ధికి దూరంగా ఉండిపోతారు. అయితే అవకాశాలు ఉన్నప్పుడు పట్టించుకోని వారు… అవకాశాలు లేనప్పుడు వాటికోసం వెంపర్లాడుతూ ఉంటారు.
ఉదాహరణకు ఒక సంస్థలో ఒక ఉద్యోగి పనిచేస్తున్నప్పుడు.. తాను జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని అనుకుంటాడు. తన ప్రతిభను ధారపోసి సంస్థను అభివృద్ధిలోకి తీసుకురావాలని అనుకుంటాడు. కానీ కొన్ని కారణాలవల్ల అతడిని ఉద్యోగంలో నుంచి తీసివేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఉద్యోగం పోయిందని బాధపడడం కంటే.. తన ప్రతిభ కోసం మరో సంస్థ ఎదురుచూస్తుంది అని ఆలోచించడం ఎంతో బెటర్. ఇలాంటి సమయంలో తన ప్రతిభ ను చూపించేందుకు మరో సంస్థ అవకాశం ఇస్తుందని భావించాలి. అంతేకానీ ఉద్యోగం పోయిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. అంతేకాకుండా మళ్లీ అదే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఇక జీవితంలో ఎప్పటికీ లేనట్లే.
ఇలా ఏం జరిగినా అంతా మన మంచికే అని అనుకునేవారు… అనుకున్న జీవితాన్ని పొందుతారు. అయితే ఉద్యోగం కూడిన సమయంలో ప్రతి వ్యక్తికి ఉండాల్సింది నైపుణ్యంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఒక ఉద్యోగం పోయిన తర్వాత వెంటనే మరో ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేకపోవచ్చు. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లాలి. అలా ఎప్పుడూ ఒకప్పుడు ఒక పెద్ద సంస్థ ఈ ప్రతిభావంతుడి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే జీవితంలో గెలిచినట్లే.
అయితే ఈ ప్రయాణంలో ఆటుపోట్లు సహజం. వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్లడానికి ఓర్పు అవసరం. ఎంతోమంది ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా తనకు ఏది అవసరమో.. ఏది కావాలో.. గుర్తుంచుకోని వాటికోసం మాత్రమే ప్రయత్నించాలి. అంతేకానీ ఎదుటివారిని చూసి తమ జీవితాన్ని మార్చుకొని ప్రయత్నం చేయొద్దు. జీవితంలో గెలవాలి అనుకునేవారు ఓర్పుతో కచ్చితంగా ఉండాలి. ఇదే సమయంలో ధైర్యం కూడా ప్రదర్శించడం ఎంతో అవసరం.