Monsoon Health Tips: ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైంది. వానలు కొడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో ఆరోగ్యంపై శ్రధ్ధ తీసుకోవాల్సిందే. లేకపోతే వ్యాధులు చుట్టుముడతాయి. ఈ కాలంలో కొత్తనీరు వస్తుంది. అందుకే రోగాలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రత సాధారణంగానే ఉన్నా సాయంత్రం వాతావరణం మారి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఐదు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని సూచించారు. వాన కాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి పెరగటం కోసం..
వర్షాకాలంలో మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి. వెల్లుల్లితో చేసిన సూప్ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అల్లం టీ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కాచిన నీటిని తాగాలి
వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగాలి. లేదంటే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల నీరు కలుషితం అవుతుంది. కాచి వడబోసిన నీరు తాగితే ఆరోగ్యం ఉంటుంది. అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఈ చిట్కా పాటిస్తే మంచిది. ఇది ఏ కాలంలోనైనా పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అజీర్తిని దూరం చేసుకోవాలి
ఈ కాలంలో మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావు. దీంతో అజీర్తి సమస్య ఏర్పడుతుంది. దీని నుంచి బయట పడాలంటే పాలు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపడరచంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పాలు తాగాలని చెబుతుంటారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి దూరం కావడానికి మనం జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
హెర్బల్ టీ
వర్షాకాలంలో పాలతో చేసుకునే టీ కంటే హెర్బల్ టీ తాగడం మంచిది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. దీంతో మనకు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అన్ని ఆకుల కషాయం కలవడంతో హెర్బల్ టీ మన దేహానికి మంచిది. దీని వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. వర్షాకాలంలో ఈ టీ తాగితే మంచి లాభాలు ఉంటాయని వైద్యులే చెబుతున్నారు.
పండ్లు
వానకాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తీసుకోవాలి. సీజనల్ గా దొరికే పండ్లు తినడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది. ఆపిల్, దానిమ్మ, బెర్రీ, ద్రాక్ష, కమల ఇలా అన్ని పండ్లు దొరకడం వల్ల వాటిని తింటే మన రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. వర్షాకాలంలో పుచ్చకాయ తినొద్దు. మిగతా అన్ని పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుంది.
మసాలాలకు దూరం
కూరల్లో మసాలాలు, కారం ఎక్కువగా తినొద్దు. మామూలుగా ఉండే ఆహారాలు తింటే సరిపోతుంది. అంతేకాని స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యం దరిచేరుతుంది. ఈ నేపథ్యంలో కారం ఎక్కువగా తింటే నష్టమే. వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అందరు కట్టుబడి ఉండాలి. లేదంటే తిప్పలు తప్పవు.