Eyesight: మనుషులకు ఉన్న ప్రధాన అవయవాల్లో కళ్ళు ఒకటి. కంటి చూపు లేకపోతే ప్రపంచమే అంధకారంగా మారిపోతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది కంప్యూటర్ ముందు ఎక్కువగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది విద్యార్థులు సైతం చిన్నవయసులోనే కళ్లద్దాలు లేనిదే చదవడం లేదు. అందువల్ల కళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కంటి సమస్యలు వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లే బదులు.. ముందు జాగ్రత్తగా కంటి సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ జాగ్రత్తల వల్ల కంటి చూపును కాపాడుకునే వారవుతారు. ఆ జాగ్రత్తలు ఏవంటే?
Also Read: దేశం గర్వించే క్షణం.. భారత సాంస్కృతిక వారసత్వానికి అరుదైన గుర్తింపు
కంటి చూపులు కాపాడుకోవాలంటే ఐ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. శారీరక దృఢత్వం కోసం బాడీ ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ ఐ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు అని కొందరికి సందేహం ఉంటుంది. ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. వీటిలో మొదటిది దూరపు చూపును కలిగి ఉండడం. అంటే ఒకే వస్తువులు దగ్గర నుంచి కాకుండా ఒక్కోసారి దూరపు వస్తువులను కూడా చూస్తూ ఉండాలి. ఉదాహరణకు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువును 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. అలా 20 నిమిషాలకు ఒకసారి చేయడం వల్ల కళ్ల ఎక్సర్సైజ్ చేసినట్లు అవుతుంది. దీంతో దగ్గరి చూపుతోపాటు దూరపు చూపు మెరుగ్గా మారుతుంది.
కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఐ ఎక్సర్సైజ్ మాత్రమే కాకుండా ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనూ కంటికి బలాన్ని ఇచ్చే ప్రత్యేకమైన పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. కంటికి ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ఆకుకూరలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లు వంటివి ఉన్నాయి. అలాగే ఒమేగా త్రీ ఎక్కువగా ఉండే చేపలను కూడా తరచూ తింటూ ఉండాలి. ఇవి కంటికి ఎంతో మేలును చేస్తాయి. అంతేకాకుండా కంట్లో సమస్యలు ఉన్న తొలగిపోతూ ఉంటాయి.
కళ్ళు బాగుండాలంటే వాతావరణం కూడా స్వచ్ఛమైనదిగా ఉండాలి. వివిధ పనుల కారణంగా బయటకు వెళ్లినప్పుడు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేకంగా సన్ గ్లాసులను వాడడం మంచిది. ముఖ్యంగా వేసవికాలంలో సన్ గ్లాస్ లేకుండా బయటకు రావద్దు. ఎందుకంటే సూర్య రష్మి ఎక్కువగా ఉండడంతో కళ్ళపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే ప్రత్యేకమైన గ్లాస్ ధరించి బయటకు వెళ్లాలి. సన్ గ్లాసెస్ కళ్లకు 100 శాతం రక్షణను ఇస్తాయి. అయితే ఇవి నాణ్యమైనవిగా ఉండేవి తీసుకోవాలి.
నేటి కాలంలో చాలామంది ఏసీ రూముల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణం లో ఉండడంవల్ల కళ్ళు తేమగా మారిపోతూ ఉంటాయి. అయితే కళ్ళు తేమగా ఉండకుండా చేయాలంటే ఎప్పటికప్పుడు కళ్ళను బ్లింక్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ పై ఉండే తేమ పోతుంది. మొబైల్ వాడే సమయంలో ఫోన్ కు 24 అంగుళాల దూరంగా ఉండాలి. ఇలా ఉండడంవల్ల మొబైల్ కాంతి కళ్ళపై పై పడకుండా ఉంటుంది.