Health: సాధారణంగా కొందరు ఉన్నఫలంగా కుప్పకూలి పోతుంటారు. అయితే వారికి ఏమైందో తెలిసేలోగా వారు మరణిస్తూ ఉంటారు.అలాంటి వారు ఎక్కువ గుండెపోటు కారణంగానే మరణించారని డాక్టర్లు తెలియజేస్తుంటారు. ఇటీవల కాలంలో వయసు తారతమ్యం లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడి మృతి చెందుతున్నారు. ఈ విధంగా చాలామందికి అనుకోకుండా గుండెపోటు వచ్చినప్పటికీ గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ముందుగానే కనపడుతుంటాయి. మరి ఆ లక్షణాలు ఏమిటి అనే విషయానికి వస్తే…
గుండెపోటు వచ్చే వారికి ముందుగా ఎడమచేతి భాగంలో లేదా ఎడమ ఛాతిలో నొప్పిగా ఉండి ఎంతో అసౌకర్యంగా వుంటుంది. ఈ విధమైనటువంటి అసౌకర్యంగా ఉన్న వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అదేవిధంగా మరికొందరిలో దవడలు మెడ భాగంలో నొప్పిగా ఉంటుంది. ఇది కూడా గుండెపోటు లక్షణమే అని చెప్పవచ్చు. మరికొందరిలో చిన్న చిన్న పనులకే అలసిపోవడం ఎక్కువగా నీరసించి పోవడం వంటి లక్షణాలు కనబడతాయి.
Also Read: Sore Throat: దగ్గు, గొంతు నొప్పిని భరించలేకపోతున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన ప్రతిసారి ఆయాసంగా అనిపించినా ఏ మాత్రం అశ్రద్ధ చూపకుండా వెంటనే స్పందించి వైద్యుని సంప్రదించి సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ముందుగానే మనకున్న సమస్యలు తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. ఈ క్రమంలోని గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.కనుక ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్న వారు ముందుగా వైద్యుని సంప్రదించడం ఎంతో మంచిది.
Also Read: Sleeping While Traveling: బస్, రైలు, కారు ప్రయాణాల్లో తెలియకుండానే ఎందుకు నిద్రపోతామో తెలుసా?