Sore Throat: దగ్గు, గొంతు నొప్పిని భరించలేకపోతున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!
Sore Throat: మనలో చాలామంది తరచూ వేధించే సమస్యలలో దగ్గు, గొంతునొప్పి సమస్యలు ముందువరసలో ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్యలు వేధిస్తాయి. పెరుగుతున్న కాలుష్యం వల్ల కూడా దగ్గు, అలర్జీ, గొంతునొప్పి లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా దగ్గు, గొంతునొప్పి సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో చల్లటి నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగితే మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు తేమగా ఉండటంతో పాటు […]

Sore Throat: మనలో చాలామంది తరచూ వేధించే సమస్యలలో దగ్గు, గొంతునొప్పి సమస్యలు ముందువరసలో ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్యలు వేధిస్తాయి. పెరుగుతున్న కాలుష్యం వల్ల కూడా దగ్గు, అలర్జీ, గొంతునొప్పి లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా దగ్గు, గొంతునొప్పి సమస్యలు దూరమవుతాయి.

Sore Throat
చలికాలంలో చల్లటి నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగితే మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు తేమగా ఉండటంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని తాగితే దగ్గు, గొంతునొప్పి దూరమవుతాయి. పసుపు అంటువ్యాధులను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. వేడినీటిలో అల్లం, తేనె కలుపుకుని తాగితే దగ్గు, గొంతునొప్పి దూరమవుతాయి.
Also Read: Sleeping While Traveling: బస్, రైలు, కారు ప్రయాణాల్లో తెలియకుండానే ఎందుకు నిద్రపోతామో తెలుసా?
ప్రతిరోజు అల్లం, తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నల్ల యాలకులు గొంతునొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. నల్ల యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పొడి దగ్గు, ఇతర గొంతు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడతాయి. చలికాలంలో గొంతునొప్పిని తగ్గించడంలో తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
తులసి ఆకులను మరిగించి టీలా చేసుకుని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో తేనె కలుపుకుని తాగితే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. లవంగం వల్ల గొంతునొప్పిని తగ్గించుకోవచ్చు. లవంగం, ఉప్పు కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
Also Read: Night Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్!
