
మనలో చాలామంది ఏవైనా ఆహార పదార్థాలు మిగిలిపోతే వేడి చేసి వాటిని తింటూ ఉంటారు. ఆహారం వేస్ట్ కాకూడదని భావించే వాళ్లు ముఖ్యంగా ఈ విధంగా చేస్తారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను హీట్ చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. పాలకూర లేదా ఇతర ఆకుకూరలతో చేసిన ఆహారం మిగిలిపోతే ఆ ఆహారన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.
వేడి చేయడం వల్ల ఆహార పదార్థాలు ఆక్సిడైజ్ కావడంతో పాటు ఐరన్ ఆక్సీకరణ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయనే సంగతి తెలిసిందే. గుడ్లు వండిన తర్వాత వీలైనంత వేగంగా తింటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలా కాకుండా గుడ్లతో చేసిన వంటకాలను వేడి చేసి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
అన్నం చల్లారితే కొంతమంది వేడి చేసుకుని మళ్లీ తింటూ ఉంటారు. అయితే అన్నంను పదేపదే వేడి చేయడం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది మిగిలిన చికెన్ ను మళ్లీ వేడి చేసి తింటూ ఉంటారు. అయితే చికెన్ ను అలా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బ తినడంతో పాటు ప్రోటీన్ కూర్పు మారే అవకాశం అయితే ఉంటుందని సమాచారం.
చికెన్ ను వేడి చేసి తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. పుట్టగొడుగులను వంట చేసిన వెంటనే వేగంగా తినేయాలి. పుట్టగొడుగులు ఎక్కువసార్లు వేడి చేసి తింటే ఆరోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి.