
ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడులపై భద్రత లభించడంతో పాటు కచ్చితంగా మంచి రాబడిని కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇండియా పోస్ట్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరేలా నెలవారీ ఆదాయ పథకాన్ని అమలు చేయగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి సాధారణ పెన్షన్ తో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
పోస్టాఫీస్ మంత్రీ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లో చేరాలంటే కనీసం 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం ఇండియా పోస్ట్ ఈ స్కీమ్ పై గరిష్ట పెట్టుబడి రూ.9 లక్షలుగా జాయింట్ ఖాతా ఓపెన్ చేసేవాళ్లకు ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించడంతో పాటు వార్షిక వడ్డీగా 6.6 శాతం ఇస్తుండటం గమనార్హం. పెట్టుబడిదారులు ఇండియా పోస్ట్ అందించే మంత్లీ ఇన్వెట్ మెంట్ స్కీమ్ 50,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.3300 వార్షిక పెన్షన్ తీసుకోవచ్చు.
50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఐదు సంవత్సరాల్లో 16,500 రూపాయల వడ్డీ లభిస్తుంది. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 5,50 రూపాయల పెన్షన్ పొందవచ్చు. 4.5 లక్షలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ మొత్తంలో నెలవారీ పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుల విషయంలో ఎటువంటి రిస్క్ ఉండదు.
పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా కొన్ని సంవత్సరాల్లోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి వల్ల ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్కువ రిస్క్ తో మంచి రాబడిని పొందాలని అనుకునే వాళ్లు ఈ స్కీమ్ ను ఎంచుకుంటే మంచిది.