Vastu Tips : చెట్లు మానవ ప్రగతికి తోడ్పడుతాయి. ఇవి ఇచ్చే ప్రశాంత వాతావరణంలో మనుషులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రస్తుత కాలంలో జనాభా పెరుగుతుంది. దీనిని అనుగుణంగా నివాసాలు, వ్యాపార కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చెట్లను నరికి వేస్తున్నారు. కానీ జనాభాకు అనుగుణంగా చెట్లు లేకపోతే స్వచ్ఛమైన గాలి దొరకదు. అయితే కొందరు పట్టణాలు, నగరాల్లో ఉండేవారు చెట్ల నుంచి వచ్చే ఆహ్లదాన్ని పొందేందుకు ఇంట్లోనే కొన్ని మొక్కలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవి పడితే అవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచుకోవాలి. ఇవి ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో వాళ్లు ఎంత డబ్బు సంపాదించినా అది నిలవకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉండదు. అలాంటి ఇల్లు ప్రశాంతగా ఉండాలంటే ముందుగా ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో పెంచుకునే ఆ మొక్కలు ఏవో చూద్దాం..
డబ్బు సంపాదించడం కోసం అందరూ కష్టపడుతారు. కానీ కొందరి ఇళ్లల్లో మాత్రమే డబ్బు నిలుస్తుంది. అందుకు పాజిటివ్ ఎనర్జీ కారణం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే మనీ ప్లాంట్ పెంచుకోవాలి. ఈ మొక్కలు పెంచుకోవడానికి పెద్దగా ప్లేస్ అవసరం లేదు. మట్టి కూడా అంతకన్నా అవసరం లేదు. ఓ పాత్రలో నీళ్లు ఉంచి అందులో మనీ ప్లాంట్ వేసినా మొక్క పెరుగుతూ ఉంటుంది. అయితే మనీ ప్లాంట్ ను ఇంటికి పడమర వైపు ఉంచడం మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అలవేరా మొక్క గురించి అందరికీ తెలిసింది. ఇది చాలా మంది ఇళ్లల్లో ఇప్పటికే ఉంది. అయితే అలవేరా ఉపయోగాల గురించి చాలా మందికి తెలియదు. ఇది ఇంట్లోని చెడును వెళ్లగట్టేలా చేస్తుంది. దీనిని ఇంటి ముందు లేదా ఇంట్లో పెంచుకోవాలి. అలవేరా ఆకుల్లో లభించే జిల్ లాంటి పదార్థాన్ని ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఔషధాలకు కూడా అలవెరాను ఉపయోగిస్తారు. ఇలాంటి మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుంది.
ఇంట్లో ఎప్పటికీ ఆనందం ఉండాలంటే పీస్ లిల్లి మొక్కను పెంచుకోవాలని అంటున్నారు వాస్తు నిపుణులు. పీస్ లిల్లి గాలిలో ఉండే టాక్సిన్ ను తీసుకొని ఆ ప్రదేశమంతా శుద్ధి చేస్తుంది. ఈ మొక్క ఉన్న ప్రదేశంలో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. దీనిని ఇంట్ల ఉంచుకోవడం వల్ల ఇల్లంతా ఎప్పటికీ స్వచ్ఛమైనగాలితో ఉంటుంది. దీంతో అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారు. ఇది చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది.
ఇంటి అలంకరించుకోవడం కొందరికి అలవాటు. అయితే డెకరేషన్ కోసం ఏవేవో వస్తువులు కొనుగోలు చేయకుండా స్నేక్ ప్లాంట్ ను పెంచుకోవడం బెటర్ అని కొందరి అభిప్రాయం. ఇది ఇంట్లో ఉండడం వల్ల చూడ్డానికి ఆ ప్రదేశం అందంగా కనిపించడంతో పాటు నెగెటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు.