
Basil Leaves: మన ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. ప్రజలు తులసిని వేర్వేరు రకాలుగా వినియోగించడం జరుగుతుంది. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజూ రాత్రి సమయంలో నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి.
పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీ లాగా తాగిన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు.
తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బ తినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్ గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటి పూతలకు నివారణిగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజూ తీసుకునే వాళ్లు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే.
దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారిణిగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది.