https://oktelugu.com/

పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ధీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందుగా టీకా ఇచ్చిన ఆయా దేశాలు ఆ తరువాత మిగతా వారందరికీ ఇస్తున్నారు. ఇటీవల వ్యాక్సిన్ పై అవగాహన పెరగడంతో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇండియాలోనైతే పని ప్రదేశాలకు వెళ్లి మరీ టీకా ఇస్తున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. అయితే పిల్లలకు టీకా వేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. టీకాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2021 / 11:01 AM IST
    Follow us on

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ధీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందుగా టీకా ఇచ్చిన ఆయా దేశాలు ఆ తరువాత మిగతా వారందరికీ ఇస్తున్నారు. ఇటీవల వ్యాక్సిన్ పై అవగాహన పెరగడంతో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇండియాలోనైతే పని ప్రదేశాలకు వెళ్లి మరీ టీకా ఇస్తున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. అయితే పిల్లలకు టీకా వేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. టీకాలు ఈ అక్టోబర్ నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈక్రమంలోనే అసలు పిల్లలకు టీకా వేయడం మంచిదా..? కాదా..? అన్న చర్చ ప్రారంభమైంది. ఎవరికి వ్యాక్సిన్ వేయాలి..? ఎవరికి వేయొద్దు..? అనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై స్పెషల్ ఫోకస్..

    బ్రిటన్ జాయింట్ కమిటీ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 12 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్య సమస్యలను బట్టి టీకా ఇవ్వడంపై కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. పిల్లల్లో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని, వారికి టీకాలు వేయడం పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపింది. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు ముందుగా టీకా ఇవ్వమని వైద్యులు సిపారసు చేస్తున్నారు. ఇండియాలో కాడిలా హెల్త్ కేర్ ‘జైకోవ్ -డి వ్యాకి్సన్’ ను అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలకు ఇచ్చేందుకు వైద్యాధికారులు రెడీ అవుతున్న వేళ ఈ నివేదిక ఆసక్తి రేపుతోంది..

    ముందుగా క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు ఇస్తాం. ఆ తరువాత ఆరోగ్యవంతులైన పిల్లలకు ఇస్తామని ఎన్ టీఏజీఐ చీఫ్ డాక్టర్ అరోరా తెలిపారు. కాడిలా హెల్త్ కేర్ టీకా  ఇండియాలో ఇప్పటికే ఆమోదం పొందింది. సూది లేకుండా దీనిని పిల్లల్లో వేస్తారు. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని అయన అంటున్నారు. ఆలోపు మరింత చిన్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ వేసి ఆ తరువాత వారికి కూడా ఇస్తామన్నారు.

    ఇదిలా ఉండగా పిల్లలందరికీ టీకా అవసరం లేదని ఐఏపీఎస్ఎమ్ నేషనల్ వైద్యుడొకరు చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. భారత్ లో నిర్వహించిన సర్వే ప్రకారం పాఠశాలలకు వెళ్లకపోయినా , ఇంట్లో నుంచి బయటకు రాని 60 శాతం మంది పిల్లల్లో కరోనా సోకిందని తెలిపారు. అంటే పిల్లలు వ్యాధి బారినపడినా ఎలాంటి లక్షణాలు లేవు. ఇందులో 3 శాతం పిల్లలు 10 ఏళ్లలోపు మిగతా వారు 11 -18 ఏళ్లలోపు ఉన్నారు. వీరిలో తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే ఉన్నాయని ఆయనంటున్నారు.

    12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు టీకా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆ వయసు కంటే ఎక్కువ ఉన్నవారికి తప్పనిసరిగా టీకా వేయాలి అని మాక్స్ హాస్పిటల్ వైద్యుడు పేర్కొన్నారు. చిన్నపిల్లల్లో కంటే వయసు పెరిగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల వారికి టీకా తప్పని సరిగా వేయాలంటున్నారు. ఇప్పటికే భారత్ లో దశల వారీగా టీకా వేయడం ప్రారంభించారు. ముందుగా వృద్ధులకు ఆ తరువాత యవ్వన వయస్కులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటి వరకు 68 కోట్ల మందికి పైగా టీకాలు వేశారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఇక అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది పిల్లలకు టీకా ఇచ్చారు. 12 నుంచి 17 ఏళ్ల వయసున్న ప్రతి 10 లక్షల మంది మగ పిల్లల్లో గెండె సంబంధిత వ్యాధులను గుర్తించారు. అదే సమయంలో ఈ వయసున్న బాలికల్లో ఎలాంటి సమస్యలు లేవు. అయితే ఏ వ్యాక్సిన్ అయినా దుప్ఫరిణామాలు ఉండాయని కాకపోతే ఇది అరుదుగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అందువల్ల పిల్లలకు టీకా వేయడం మంచిదేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు..