మనలో చాలామంది తెల్ల బియ్యంను ఎంతో ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలు ఉండే బియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే తెల్ల బియ్యం ఆరోగ్యానికి మంచిది కాదని బ్రౌన్ రైస్ తింటే మంచిదని చాలామంది చెబుతున్నారు. బ్రౌన్ రైస్ తినడం ద్వారా అనారోగ్య సమస్యలకు కూడా సులభంగా చెక్ చెప్పడం సాధ్యమవుతుంది. బ్లాక్ రైస్ చూడటానికి నల్లగా ఉండగా వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
బ్లాక్ రైస్ లో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలని భావించే వాళ్లు బరువు తగ్గాలని అనుకునే వాళ్లు బ్లాక్ రైస్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్ తో పోల్చి చూస్తే రెడ్ రైస్ భిన్నంగా కనిపిస్తాయి. రెడ్ రైస్ ను తింటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో రెడ్ రైస్ ఉపయోగపడతాయి.
షుగర్ తో బాధ పడేవాళ్లు బ్రౌన్ రైస్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్ లో తెల్లబియ్యంతో పోలిస్తే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తెల్లబియ్యంలో ఏ విధంగా కేలరీలు ఉంటాయో ఈ బియ్యంలో కూడా అదే విధంగా కేలరీలు ఉంటాయి. బ్రౌన్ రైస్ తినడం ద్వారా కూడా బరువు తగ్గడంతో పాటు ఆకలిని తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అందరి ఇళ్లలో ఉపయోగించే తెల్ల బియ్యంలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అయితే మిగిలిన బియ్యంతో పోలిస్తే ఇందులో అవి తక్కువగా ఉంటాయి.