https://oktelugu.com/

Mustard : పొట్టిగా ఉంటూ టేస్ట్ ను మాత్రమే అందిస్తాయి అనుకుంటున్నారా? వీటి గురించి తెలిస్తే షాక్ అవుతారు?

సరిగ్గా ఉపయోగించుకోవాలి కానీ వంటింట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని ఉపయోగించడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పసుపు, అల్లం గురించి చాలా మందికి తెలుసు కానీ ఇతర పదార్థాల గురించి తెలుసా? కొన్ని పదార్థాల గురించి అవగాహన ఉన్న మరికొన్ని పదార్థాల గురించి తెలియకపోవచ్చు. అయితే ప్రతి ప్రతి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో అతి ముఖ్యమైనది ఆవాలు. ఇంతకీ కూరలో ఆవాలు ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం పోపు లో వేసి టేస్ట్ ను పెంచుతాయి అనుకుంటున్నారా? ఓ సారి ఈ ఆవాలు ఏ రేంజ్ లో మంచిని పంచుతున్నాయో తెలిస్తే ఇంకో నాలుగు ఆవాలను ఎక్కువగానే వేస్తారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 14, 2024 / 12:09 PM IST

    Want to be short and only serve a taste? Would you be shocked to know about these?

    Follow us on

    Mustard :  ప్రతి రోజూ దాదాపు అన్ని వంటకాల్లో ఆవాలను ఉపయోగిస్తారు. ఆవాలు కూరలకు చక్కటి వాసనను అందిస్తాయి. కేవలం వాసన మాత్రమే కాదు.. ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేంటో  ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. క్రమం తప్పకుండా ఆవాలని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువ. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.

    ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆవాలు తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్‌ లో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి. వీటన్నింటి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవుతుందని మీకు తెలుసా?

    ఆవాల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఆవాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ పనితీరు సరిగ్గా ఉంటుంది. థైరాయిడ్ జీవక్రియకి హెల్ప్ అవుతుంది. అందుకే మీరు ఆవాలు, ఆవపిండి, ఆవనూనెని మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. దీని వల్ల చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

    ఆవాల్లో కొన్ని గుణాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి. దీంతో కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆవాల్లో రిచ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మీ చర్మం మెరిసేలా చేస్తాయి. అంతేకాదు జుట్టుకు బలాన్ని అందిస్తాయి. ఆవాల్లోని విటమిన్ ఎ, కె, సి లు ఉంటాయి. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. దీంతో పాటు ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి ఆవాలు.

    ఆవాల్లో ఫినోలిక్ కాంపౌండ్స్, టోకోఫెరోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో సహాయ పడతాయి. దీనివల్ల మీ కాలేయ పనితీరుని మెరుగు అవుతుంది. వీటితో పాటు జీర్ణ సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.