https://oktelugu.com/

Artificial Intelligence : వైరల్ వీడియో: ఐదేళ్ల చిన్నారి చూస్తుండగానే 95 ఏళ్ల వృద్ధురాలిగా మారిపోయింది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసాధ్యాలు సాధ్యమవుతున్నాయి. ఇదే సందర్భంలో ఈ  ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఐటీ రంగాల్లో మరింత చొప్పించే విధానాన్ని నివసిస్తూ దిగ్గజ కంపెనీలకు చెందిన సీఈవోలు రాజీనామాలు చేస్తున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : May 7, 2023 / 06:03 PM IST
    Follow us on

    Artificial Intelligence : సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవితంలో కనివిని ఎరుగని మార్పులకు కారణమవుతోంది. అంతే కాదు మనిషి జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చుతోంది. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానంలో మారండి మార్పులు చోటు చేసుకుంటుండటంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చెప్ప తీరు కాకుండా ఉంది. కంప్యూటర్ అనే ఎలక్ట్రానిక్ యంత్రం అప్పుడప్పుడే పరిచయమైనప్పుడు సీ+ లాంగ్వేజ్ వస్తేనే గొప్ప అనుకున్నారు. కానీ ఇప్పుడు సీ + లాంగ్వేజ్ అనేది ఒక చరిత్ర అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో ఊహకు కూడా అందడం లేదు. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పడం కష్టమే.
    సృజనాత్మకతకు పెద్దపీట
    సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు క్రియేటర్స్ తమకున్న మేథో పరిజ్ఞానం ద్వారా కొత్త కొత్త వాటికి ప్రాణం పోస్తున్నారు. తమ ఊహల్లో మెదిలే వాటిని కూడా  కళ్ళముందు ప్రత్యక్షం చేయిస్తున్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్లో కృత్రిమ మేథ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీని ద్వారా సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చే వారికి డిమాండ్ మరింత పెరిగింది. దీంతో పాటు ఇంటర్నెట్లో విపరీతమైన ట్రెండ్ కొనసాగుతోంది.
    ఐదేళ్ల పాపను వృద్ధురాలిని చేశారు
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో క్రియేటర్స్ నిరూపిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించిన ఒక వీడియో నెటిజన్ల ను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ వీడియో లో ఐదు సంవత్సరాల అమ్మాయి 95 సంవత్సరాల వరకు ఎలాంటి మార్పులకు గురవుతుందో, ఎలా రూపాంతరం చెందుతుందో ఈ వీడియోలో క్రియేటర్లు అద్భుతంగా చూపించారు. ఈ వీడియో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా.. టెక్నాలజీ ఎంతటి మార్పులు చెందుతుందో ఒక్కసారి మీరు గమనించండి అంటూ ఆయన క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
    ఉద్యోగాలు ఊడిపోతున్నాయి
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసాధ్యాలు సాధ్యమవుతున్నాయి. ఇదే సందర్భంలో ఈ  ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఐటీ రంగాల్లో మరింత చొప్పించే విధానాన్ని నివసిస్తూ దిగ్గజ కంపెనీలకు చెందిన సీఈవోలు రాజీనామాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఐటి పరిశ్రమలో పెద్ద కుదుపునకు కారణమవుతోంది.